Devara villain: బ్రేకప్ దిశగా ఎన్టీఆర్ విలన్.. కారణం ఏంటంటే..?

Devara villain.. ఈమధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో విడాకుల ట్రెండ్ ఎక్కువగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అన్యోన్యంగా జీవిస్తున్నారు అనుకున్న ఎన్నో జంటలు విడాకులు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాయి. ఈ క్రమంలోనే మరికొన్ని జంటలు ఏడడుగులు వేయకుండానే బ్రేకప్ దిశగా అడుగులు వేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అలాంటి వారిలో దసరా విలన్ కూడా ఒకరు. ఆయనే మలయాళ ప్రముఖ నటుడు షైన్ టామ్ చాకో. త్వరలో రెండో పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో ఊహించని షాకింగ్ న్యూస్ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.

Devara villain: NTR villain towards breakup.. What is the reason..?
Devara villain: NTR villain towards breakup.. What is the reason..?

పెళ్లి వరకు వెళ్లకుండానే బ్రేకప్ చెప్పిన షైన్ టామ్ చాకో..

ఈ ఏడాది ప్రారంభంలో తన ప్రియురాలితో నిశ్చితార్థం కూడా చేసుకున్న ఈయన ఇప్పుడు బ్రేకప్ గురించి కీలక వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రస్తుతం ఈయన వయసు 40 ఏళ్లు. త్వరలో పెళ్లి తదీని ప్రకటిస్తారని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఆయన మాటలు ఆశ్చర్యానికి గురిచేసాయి. తెలుగులో నాని నటించిన దసరా సినిమాలో విలన్ గా నటించి మెప్పించిన ఈయన , ఆ తర్వాత రంగభలి సినిమాలో కూడా కనిపించారు. ఏదేమైనా పెళ్లి జరగకముందే నిశ్చితార్థం చేసుకొని అప్పుడే బ్రేకప్ చెప్పడం అందరిలో పలు అనుమానాలకు దారితీస్తోంది.

షైన్ టామ్ చాకో సినిమాలు..

ఇక నటుడు షైన్ టామ్ చాకో మలయాళం చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మలయాళ సినిమా నమ్మల్ సినిమాలో చిన్న పాత్రలో నటించి, నటుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన ఆ తర్వాత సాల్ట్ అండ్ పెప్పర్, చాప్టర్స్, 5సుందరిగల్, వినోద్ అక్క సూంట, దాతాడియ వంటి చిత్రాలలో నటుడిగా నటించి మంచి పేరు సొంతం చేసుకున్నారు. నటుడిగా , కథానాయకుడిగా వైవిద్యమైన పాత్రలు పోషించి తనకంటూ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈయన, ఎక్కువగా విలన్ పాత్రలు చేసి మెప్పించారు. అలాగే తమిళ్లో విజయ్ దళపతి నటించిన బీస్ట్ సినిమాలో తీవ్రవాదిగా కూడా నటించి అటు కోలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. డబుల్ ఎక్స్ జిగర్తాండ వంటి చిత్రంలో కూడా నటించి సౌత్ ఇండియా ప్రేక్షకులకు భారీగా పరిచయం అయ్యారు.

- Advertisement -

బ్రేకప్ కి కారణం..

ఈయన ప్రేమ, పెళ్లి విషయానికొస్తే 40 యేళ్ళ షైన్ టామ్ చాకో తన చిరకాల స్నేహితురాలు, మోడల్ తనూజాతో ఏడాది జనవరిలో ఎంగేజ్మెంట్ అయింది. వారి పెళ్లి తేదీని కూడా త్వరలోనే ప్రకటిస్తారని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో షైన్ టామ్ చాకో ఉన్నట్టుండి ఇంస్టాగ్రామ్ నుండి వారిద్దరి ఎంగేజ్మెంట్ ఫోటోలను తొలగించాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన మళ్లీ సింగిల్ అంటూ తెలిపాడు. దీంతో వీరు పెళ్లి వరకు వెళ్లకుండానే మధ్యలో ముగిసిపోవడం అభిమానులను కలవరపెడుతోంది. తమ బంధం కలుషితంగా మారిందని ఇద్దరి మధ్య ఒకరినొకరికి ప్రేమ ఉన్నప్పటికీ కలిసి కొనసాగలేకపోయామని చెప్పుకొచ్చాడు.

డేటింగ్ యాప్ పై దృష్టి..

ప్రస్తుతం తాను డేటింగ్ యాప్ పై దృష్టి పెట్టానని, నచ్చిన యువతి కోసం వెతుకుతున్నానని కూడా ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇదిలా ఉండగా ఈయనకు తబిత మ్యాథ్యూస్ అనే భార్య వుంది. అలాగే కూతురు ఉంది. గతంలోనే వీళ్ళిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు.

 

View this post on Instagram

 

A post shared by ABDUL SABITH A (@sabi_christy)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు