Bigg Boss: దేవరకొండ ఫ్యాన్స్ పై విరుచుకుపడ్డ బిగ్ బాస్ ఫేమ్ యావర్.. కారణం ఇదే..!

Bigg Boss: బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది నటీనటులు మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. అలా సంపాదించుకున్న వారిలో బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ యావర్ కూడా ఒకరు. మొదట్లో ఈ నటుడు ఎవరో కూడా పెద్దగా ఎవరికి తెలియదు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాడు అప్పటినుంచి ఈయనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రెసెంట్ వరస సినిమాలు ఓకే చేస్తూ దూసుకుపోతున్నాడు యావర్.

ఇక తాజాగా ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గమ్ గమ్ గణేశా మూవీ ప్రమోషన్స్లో పాల్గొన్నారు యావర్. ఈ సందర్భంగా గానే ఎవరు మాట్లాడుతూ..” నాకు ఇంతలాగా సపోర్ట్ చేసినందుకు ఆనంద్ దేవరకొండ బ్రో కి స్పెషల్ థాంక్స్ ” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అనంతరం యావర్ ఇంకా మాట్లాడుతూ ఉండగా ఆనంద్ దేవరకొండ అభిమానులు అరవడం మొదలుపెట్టారు. దీంతో యావర్ కి ఫ్రస్టేషన్ మొదలైంది.

Devarakonda's fans lashed out at Bigg Boss fame
Devarakonda’s fans lashed out at Bigg Boss fame

” మీరు ఫాన్స్ కదా.. ఫస్ట్ నన్ను మాట్లాడనివ్వండి ” అంటూ ఆనంద్ దేవరకొండ ఫ్యాన్స్ పై ఫైర్ అయ్యాడు యావర్. అయినాప్పటికీ వారు ఈయన మాటలను లెక్కచేయకుండా అరవడం మరింత రెట్టింపు చేశారు. దీంతో యావర్ పేషెన్సీ ని కోల్పోయాడు. ఇక తనను కంట్రోల్ చేసేందుకు అక్కడే ఉన్న ఆనంద్ దేవరకొండ అది చెప్పి కూల్ చేశాడు. ప్రెసెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు