Devi Prasad: ఆయన లేకపోతే నా జీవితమే లేదు.. డైరెక్టర్ ఎమోషనల్..!

Devi Prasad.. ప్రముఖ సీనియర్ డైరెక్టర్ నటుడు దేవి ప్రసాద్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఎన్నో చిత్రాలను తెలుగు తెరకు అందించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన తాజాగా దివంగత నటులు శ్రీహరి మీద ఎమోషనల్ పోస్ట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శ్రీహరితో తనకున్న బంధం గురించి ఆయనతో ఉన్న బాంధవ్యం గురించి చెప్పుకొచ్చారు. తాజాగా ఈ విషయాలను షేర్ చేస్తూ .. ఒక పోస్ట్ చేయగా ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. నిజానికి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే దేవి ప్రసాద్ అప్పుడప్పుడు తన పాత రోజులను పాత మెమోరీస్ రీ కాల్ చేసుకుంటూ పోస్టులు చేస్తూ ఉంటాడు. అందులో భాగంగానే శ్రీహరి మీద వేసిన పోస్ట్ కూడా ఇప్పుడు అందరిని కదిలిస్తోంది అని చెప్పవచ్చు.

Devi Prasad: Without him I have no life.. Director is emotional..!
Devi Prasad: Without him I have no life.. Director is emotional..!

నా జీవితాన్ని మార్చేసిన గొప్ప వ్యక్తి శ్రీహరి..

శ్రీహరి తన పోస్ట్ విషయంలో.. ఏ మనిషి జీవితంలో అయినా సరే ఏ మంచి మలుపుకైనా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎవరో ఒకరు కారణమవుతారు . నా జీవితంలో మార్పుకి కూడా రియల్ స్టార్ కారణమయ్యారు. నన్ను దర్శకుడిగా గుర్తించిన తొలి వ్యక్తి శ్రీహరి. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు చిన్న పాత్రలలో ఆయన నటిస్తుండేవారు. అప్పటినుంచి మా మధ్య స్నేహం కుదిరింది. నా జీవితంలో పరోక్షంగా నా గురించి ఎంతోమందికి గొప్పగా చెప్పడం నేను చూశాను.

పేదవారికి ఆరాధ్య దైవం శ్రీహరి..

మద్రాస్ నుండి మేము హైదరాబాద్ కి షూటింగ్ కోసం వచ్చినప్పుడు ఆయన లోకల్ కాబట్టి మమ్మల్ని అన్నిచోట్లకు తిప్పి అబిడ్స్ లోని చర్మాస్ షోరూం కి తీసుకెళ్లి డిస్కౌంట్ లో మాకు బట్టలు కూడా ఇప్పించారు. ఆ జ్ఞాపకాలన్నీ ఇప్పటికీ ఇంకా అలాగే ఉన్నాయి. ఎన్టీఆర్ , చిరంజీవి , వెంకటేష్ వంటి మహామహులు అతిథులుగా లలిత కళా తోరణం లో భారత్ బంద్ సినిమా జరిగినప్పుడు అది విజయవంతం కావడానికి ముఖ్య కారణం శ్రీహరి బలగమే. ముఖ్యంగా ఆయన తనదైన శైలిలో ప్రత్యేకమైన కంఠంతో అద్భుతంగా డైలాగ్స్ చెప్పి చప్పట్లు కొట్టించుకోవడం ఆయన పట్టుదలకు నిదర్శనం అని చెప్పాలి. సముద్రంలో వర్షం కురవకపోయిన పర్లేదు కానీ ఆకలి తీరిన వాడికి అన్నం పెట్టడంలో ఔచిత్యం లేదు అని చెప్పేవారు శ్రీహరి. అందుకే ఆయన హీరోగా వెలిగిన రోజుల్లో ఏ పెద్ద దర్శక నిర్మాతల ప్రాపకం కోసం ఆయన ప్రాకలాడకుండా విజయాల కోసం వేచి చూస్తున్న వారి వైపే ఎక్కువ మగ్గు చూపాడు.. అందుకే ఆయన రీల్ స్టార్ కాకుండా రియల్ స్టార్ అయిపోయాడు. ముఖ్యంగా ఎవరి బాధలైనా విన్నా సరే లేదా ఆయన నటించిన సెంటిమెంటు సీనైనా సరే చూస్తున్నప్పుడు ఖచ్చితంగా కన్నీరు పెట్టుకునేంత సున్నితత్వం అయనది. తప్పు చేసిన వాడి తోలువలచే కరుకుదనం రెండూ కూడా ఆయనలో ఉన్నాయి.

- Advertisement -

శ్రీహరి కొడుక్కి తండ్రిగా నటించడం ఆనందంగా ఉంది..

ముఖ్యంగా శ్రీహరి దంపతులు నా పెళ్ళికి వచ్చారు.. అప్పుడు వారి ఒడిలో మూడు నెలల పసివాడుగా ఉన్న వాళ్ళ చిన్నబ్బాయి మేఘాంస్ శ్రీహరి ఇప్పుడు పెద్దవాడై హీరోగా పరిచయమైన రాజ్ ధూత సినిమాలో వాడికి నేను తండ్రిగా నటించడం నాకు ఆనందాన్నిచ్చింది అంటూ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పోస్ట్ చేశారు శ్రీహరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు