Devi Sri Prasad: గొట్టంతో పాట

దేవి శ్రీ ప్రసాద్ తెలుగు సంగీత దర్శకులలో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటివరకు దేవి శ్రీ ప్రసాద్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఉన్నాయి. ప్రస్తుతం దేవి బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి ఇదివరకే రిలీజైన పాటలు కూడా మంచి హిట్ అయ్యాయి.

గత వారం విడుదలైన పూనకాలు లోడింగ్ రాప్ నంబర్ ఇప్పటివరకు 12 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ పాట కొరియోగ్రఫీ, మెగాస్టార్ మరియు మాస్ మహారాజా మధ్య ఎనర్జీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సాంగ్ చేయడానికి ప్రధానంగా ఒకే వాయిద్యం – చీర్ హార్న్ – ఉపయోగించారు.

దర్శకుడు బాబీ, కొరియోగ్రాఫర్ శేఖర్ మరియు పాటల రచయిత రోల్ రైడాతో ఈ సాంగ్ గురించి చర్చిస్తూ తన ప్రొమోషనల్ ఇంటర్వ్యూలలో దేవి దీనిని పచ్చని గొట్టం అని చెప్పుకొచ్చాడు. దేవి దీనిని గోవాలోని ఒక మ్యూజిక్ షాప్ లో కొన్నాడు దేవి. “నేను కొత్త ప్రదేశాన్ని సందర్శించినప్పుడల్లా,అక్కడ పరికరాలను కొనుగోలు చేస్తాను. నా స్టూడియో అలాంటి వాయిద్యాలతో నిండి ఉంది. నేను సంగీత వాయిద్యం కోసం గోవాలో తిరుగుతున్నప్పుడు, సంగీత దుకాణంలోని పిల్లల విభాగంలో ఈ పచ్చని గొట్టం కనిపించింది. కిరోసిన్ గరాటులా ఉంది. నేను 250 రూపాయలకు తీసుకున్నాను” అని దేవి ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు