Devil: కళ్యాణ్ రామ్ డెవిల్ స్టోరీ ఇదేనా?

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన చిత్రం బింబిసార. ఈ చిత్రం కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో దర్శకుడిగా మారిన మల్లడి వశిస్ట్ కు కూడా మంచి పేరు వచ్చింది. దీనికి సీక్వెల్ గా బింబిసార2 కూడా రాబోతుంది. అయితే దీనికి ముందకు కళ్యాణ్ రామ్ ఒప్పుకున్న అమిగోస్, డెవిల్ సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది. ఇందులో డెవిల్ సినిమా కు ఉన్న ట్యాగ్ లైన్ ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్. ఈ ట్యాగ్ లైన్ తో పాటు ఇప్పటికే వచ్చిన అనౌన్స్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

డెవిల్ చిత్రానికి నవీన్ మేడారం దర్శకత్వం వహించగా, అభిషేక్ పిక్ఛర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. భారతదేశ ఉపయోగం కోసం బ్రిటీష్ వారితో చేతులు కలిపి, ఒక రహాస్యాన్ని ఛేదింస్తాడాట. ఈ క్రమంలో ఎదురైన ఎదురైన సమస్యలు, కళ్యాణ్ రామ్ కు వచ్చిన సవాళ్లు సినిమాలో ఉంటాయని తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని స్వతంత్య్రానికి పూర్వం 1945 మద్రాస్ ప్రెసిడెన్సీ లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

ఇప్పటికే కొంత మేర షూటింగ్ ను పూర్తి చేసుకున్న డెవిల్.. తర్వాతి షెడ్యూల్ ను తమిళనాడులో ప్లాన్ చేశారని టాక్. తమిళనాడులోని కారైకుడి ప్రాంతంలో తర్వాత షెడ్యూలు ఉండబోతుందట. దాదాపు 20 రోజుల పాటు అక్కడే షూటింగ్ ఉంటుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో కళ్యాణ్ రామ్ తో పాటు మరి కొంత మంది నటీనటులపై షూటింగ్ ఉంటుందని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు