Dhamaka : నైజాంలో ‘మాస్’ కలెక్షన్లు

తెలుగు సినిమాలకు నైజాం ఏరియా చాలా కీలకంగా ఉంటుంది. ఇక్కడ థియేటర్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటాయి. ఒక సినిమా హిట్.. ఫ్లాప్ అని డిసైడ్ చేసేది నైజాం ఏరియానే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నైజాంలో అన్ని వర్గాల ప్రజలతో పాటు, రెండు రాష్ట్రాల ప్రేక్షకులు కూడా ఉంటారు. అందుకే సినిమా ప్రమోషన్లు నైజాం ఏరియానే టార్గెట్ చేసుకుని జరుగుతాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇతర కార్యక్రమాలు, సక్సెస్ మీట్ లు కూడా నైజాం ఏరియాలోనే ఎక్కువగా జరుగుతాయి.

అంతటి ప్రాముఖ్యత నైజాం ఏరియాకు ఉంటుంది. ఇలాంటి నైజాం ఏరియాలో మాస్ మహారాజ రవితేజ తాజా సినిమా ధమాకాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఇక్కడ సినిమా రిలీజ్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు కలెక్షన్లు రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఈ వీకెండ్ ముగిసేసరికి ధమాకా సినిమాకు నైజాం ఏరియాలో 5.7 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. రవితేజ కెరీర్ లో నైజాం ఏరియా నుంచి ఎప్పుడూ కూడా ఇలాంటి కలెక్షన్లు రాలేదు.

కాగా రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ధమాకాకు మొదటి నుంచి మంచి టాక్ వస్తోంది. వీకెండ్ లో కూడా కలెక్షన్లు భారీగా వచ్చాయి. ఈ రోజు క్రిస్మస్ సెలవు దినం కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ వీకెండ్ లో ధమాకా కు ప్రపంచ వ్యాప్తంగా 32 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు