Dhanush : థియేటర్లలో ఆడని సినిమాకు ఇంటర్నేషనల్ అవార్డు… ధనుష్ సినిమాకు అరుదైన గౌరవం

Dhanush : కొన్ని సినిమాలకు థియేటర్లలో పెద్దగా జనాదరణ దక్కకపోయినా ప్రశంసలకు ఏమాత్రం కొదవ ఉండదు. అలాంటి ఓ సినిమా తాజాగా ఇంటర్నేషనల్ అవార్డును దక్కించుకోవడం విశేషం. పైగా ఆ మూవీ కోలీవుడ్ స్టార్ ధనుష్ ది కావడం మరో ఇంట్రెస్టింగ్ విషయం. మరి ఆ అరుదైన ఘనతను దక్కించుకున్న ధనుష్ మూవీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ధనుష్ సినిమాకు అరుదైన గౌరవం

తమిళ చిత్రసీమలో అగ్రనటుడు ధనుష్ హీరోగా ఈ ఏడాది పొంగల్‌కు విడుదలైన చిత్రం కెప్టెన్ మిల్లర్. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సత్యజోతి ఫిలిమ్స్ నిర్మించింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ప్రియాంక మోహన్, శివరాజ్ కుమార్, నివేద సతీష్ సహా పలువురు నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. బ్రిటీష్ కాలం నాటి కథాంశంతో రూపొందిన ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలై తమిళ అభిమానుల ఫరవాలేదు అనే రెస్పాన్స్‌ను అందుకుంది. రూ.50 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం తమిళ బాక్సాఫీస్ వద్ద బాగానే రాణించింది. కానీ తెలుగు ప్రేక్షకులను కనీసం థియేటర్ల దాకా రప్పించలేకపోయింది. కానీ తాజాగా ఏకంగా నేషనల్ అవార్డును తన ఖాతాలో వేసుకున్న ఈ మూవీ ధనుష్ కు అరుదైన గౌరవాన్ని తెచ్చి పెట్టింది.

Image

- Advertisement -

బెస్ట్ మూవీగా అవార్డు

అంతకుముందు లండన్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో 2024 సంవత్సరానికి గానూ ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో కెప్టెన్ మిల్లర్ నామినేట్ అయినట్లు చిత్ర నిర్మాణ సంస్థ సత్యజోతి ఫిల్మ్స్ తన X పేజీలో ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా లండన్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో 2024కి గానూ ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో కెప్టెన్ మిల్లర్ చిత్రానికి అవార్డు లభించిందని చిత్ర దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ తన సోషల్ మీడియాలో తెలిపారు. తన పోస్ట్‌లో “జాతీయ చలనచిత్ర అవార్డుకు ధన్యవాదాలు. ధనుష్ కెప్టెన్ మిల్లర్ స్పెయిన్ ఫైటింగ్ ది వోల్ఫ్ ప్యాక్, జర్మనీ సిక్స్టీ మినిట్స్, ది హార్ట్‌బ్రేక్ ఏజెన్సీ, జపాన్ ది పరేడ్స్‌తో వంటి చిత్రాలతో పోటి పడి ప్రతిష్టాత్మక  ఉత్తమ విదేశీ భాషా చిత్రం’ అవార్డును గెలుచుకుంది” అంటూ రాసుకొచ్చారు. చిత్రబృందం తరపున సత్యజ్యోతి ఫిల్మ్స్ నిర్మాత అవార్డును అందుకున్నారు.

కెప్టెన్ మిల్లర్ వర్సెస్ అయాలాన్

ఈ ఏడాది జనవరి 12 న పొంగల్ రేసులో కెప్టెన్ మిల్లర్, అయాలాన్ సినిమాలు నిలిచాయి. ధనుష్ హీరోగా నటించిన కెప్టెన్ మిల్లర్ కథ బ్రిటిష్ సామ్రాజ్యం, కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేసే ఒక తిరుగుబాటుదారుని చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీకి సీక్వెల్స్ ఉంటాయని అఫిషియల్ గా ప్రకటించారు. కానీ ఫస్ట్ పార్ట్ కే మిక్స్డ్ రెస్పాన్స్ దక్కింది. అయితే శివ కార్తికేయన్ నటించిన అయాలాన్ అనే ఏలియన్ మూవీకి అదిరిపోయే రెస్పాన్ దక్కింది. దీంతో ఈ ఏడాది కోలీవుడ్ బాక్స్ ఆఫీసు వద్ద అయాలాన్ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు