Dhanush : ట్రోలర్స్ గూబ గయ్యిమనిపించిన ధనుష్.. తిక్క కుదిరిందిగా..

Dhanush : తమిళ స్టార్ హీరో ధనుష్ సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతూ రిలీజ్ అవుతున్నాయి.. దాంతో ఇక్కడ కూడా ఆ హీరోకు మంచి మార్కెట్ ఏర్పడింది.. ప్రస్తుతం రాయన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.. అయితే, ధనుష్ సినిమాల పరంగా ట్రోల్స్ రాలేదు. కానీ పర్సనల్ లైఫ్ మీద ట్రోల్స్ ఇటీవల ఎక్కువైన సంగతి తెలిసిందే.. విడాకులు తీసుకున్నాక అతని భార్య కన్నా ఎక్కువగా తనపై ట్రోల్స్ వస్తున్నా ధనుష్ గత కొన్ని రోజులుగా పట్టించుకోలేదు.. కానీ తాజాగా ట్రోల్స్ పై స్పందించినట్లు తెలుస్తుంది…

ధనుష్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి, తన యాక్టింగ్ గురించి చాలామందికి నెగిటివ్గా కామెంట్ చేసే ఛాన్స్ ఉండదు. అందుకే తన పర్సనల్ లైఫ్ను నిత్యం టార్గెట్ చేస్తూ వస్తున్నారు.. ఇటీవల ధనుష్ కొత్త ఇల్లు కొన్నాడన్న సంగతి తెలిసిందే.. ఆ ఇంటికి షిఫ్ట్ అయ్యాక ట్రోల్స్ ఎక్కువయ్యాయి.. ఆ ఇల్లు కొనడానికి కారణం ను వివరించారు.. చిన్నప్పుడు పడ్డ కష్టాలను గుర్తు చేసుకొని ఆ ఇల్లు కొన్నట్లు ఇటీవల చెప్పాడు. పోస్ గార్డెన్లో పెద్ద ఇల్లు కొనడం ఇంత పెద్ద చర్చలకు దారితీస్తుందని ముందే తెలిసుంటే నేను చిన్న అపార్ట్మెంటే కొనేవాడిని. నాలాంటి మనిషి పోస్ గార్డెన్లో ఇల్లు కొనకూడదా? వీధుల్లో పుట్టి పెరిగిన మనిషి వీధుల్లోనే చనిపోవాలా? నేను పోస్ గార్డెన్లో ఇల్లు కొనడం వెనుక ఉన్న అసలు కథను చెప్పాడు..

Dhanush gave a strong warning to trollers.
Dhanush gave a strong warning to trollers.

ధనుష్ ఇచ్చిన క్లారిటీతో ట్రోలర్స్ గూబ గుయ్యి మందని తెలుస్తుంది. ఈ దెబ్బతో ఇక జీవితంలో ధనుష్ పై ట్రోల్స్ చెయ్యాలంటే భయపడతారని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.. ఫ్యాన్స్ రియాక్షన్ తో ఈ వార్త మరోసారి నెట్టింట ట్రెండ్ అవుతుంది.. ఇక ధనుష్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రాయన్, కుబేర సినిమాలలో నటిస్తున్నాడు.. ఆ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ గా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.. ఈ సినిమాల తర్వాత మరో రెండు సినిమాలను లైన్లో పెట్టినట్లు ఇండస్ట్రీలో టాక్..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు