Dhanush: ‘ప పాండి’తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు ధనుష్. ధనుష్ దర్శకత్వం వహించిన రెండవ ‘రాయన్’ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు తన మూడవ దర్శకత్వ సినిమాగా ‘నిలవుకు ఎన్మేల్ ఎన్నడి కోబమ్’ (నీక్) సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మాథ్యూ థామస్ మరియు ప్రియా ప్రకాష్ వారియర్ తో పాటు చాలామంది యంగ్ కాస్ట్ కూడా కనిపించనున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ సినిమాకి జివి ప్రకాష్ సంగీతం అందించనున్నారు.
ఇటీవల చెన్నైలో జరిగిన మీడియా ఇంటరాక్షన్‌లో మ్యూజిక్ కంపోజర్ జివి తాను ఈ చిత్రంలో అతిధి పాత్రలో కనిపించబోతున్నట్లు వెల్లడించాడు. జి.వి.ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ.. చాలా కాలం తర్వాత ఓ యంగ్ ఆల్బమ్ కోసం పనిచేశానని, ఈ సినిమా ‘2కె కిడ్స్’కి ట్రీట్ అవుతుందని హింట్ ఇచ్చాడు. జివి ప్రకాష్ స్వరపరచిన ఈ సినిమా పాటలకు ధనుష్ సాహిత్యం అందించారు. మొత్తం నాలుగు పాటలు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి వాటిని ఒక్కొక్కటిగా రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం ధనుష్ శేఖర్ కమ్ములతో ‘కుబేర’, దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్‌తో ‘తేరే ఇష్క్ మే’ మరియు దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్‌తో ఇంకా పేరు పెట్టని సినిమాతో పాటు, ఇళయరాజా బయోపిక్ అన్నీ షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. ‘నిలవుకు ఎన్మేల్ ఎన్నడి కోబమ్’ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ధనుష్ పాడారు. ఈ పాటను త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు జివి ప్రకాష్ ట్విట్టర్ వేదికగా తెలిపాడు.