Dhanush: మల్టీ స్టారర్ సినిమా చేస్తే.. ఆ టాలీవుడ్ హీరో తోనే చేస్తా.. ఎవరంటే..?

Dhanush.. ప్రముఖ కోలీవుడ్ హీరో ధనుష్ తాజాగా నటిస్తున్న చిత్రం రాయన్.. అయితే ఈ సినిమా జూలై 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించడానికి చిత్ర బృందం ప్లాన్ చేసింది. అందులో భాగంగానే చిత్ర యూనిట్ మొత్తం ప్రమోషన్స్ శరవేగంగా చేపడుతున్నారు. ఈ మేరకు ధనుష్ కూడా తన సినిమాను తెలుగులో ప్రమోట్ చేసుకునేందుకు ఆదివారం రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. అయితే ఈ ఈవెంట్ లో అందరికీ నమస్కారం అనే పదం తప్ప మిగతా అంతా కూడా తమిళంలోనే మాట్లాడారు.. నిజానికి చెన్నైలో సినిమా ఈవెంట్ పెడితే.. తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్లి స్టేజ్ మీద పూర్తిగా తెలుగులోనే మాట్లాడితే అక్కడ వాళ్ళు అసలు పట్టించుకోరు. అసలు స్పీచ్ కూడా వినరు. అంతేకాదు అక్కడ పూర్తిగా తెలుగులోనే మాట్లాడే ధైర్యం కూడా మన తెలుగు హీరోలు చేయరు. మొహమాటానికైనా సరే నాలుగైదు తమిళ్ పదాలు నేర్చుకుని మాట్లాడి వస్తూ ఉంటారు. కానీ ధనుష్ మాత్రం ఊహించని విధంగా పూర్తిస్థాయిలో తమిళ్లోనే మాట్లాడారు.

Dhanush: If you do a multi-starrer film.. you will do it with that Tollywood hero.. who is it..?
Dhanush: If you do a multi-starrer film.. you will do it with that Tollywood hero.. who is it..?

వారి నుంచి ఎంతో నేర్చుకున్నాను – ధనుష్

ఆయన మాట్లాడుతూ.. నా కెరియర్ మొదట్లో మంచి దర్శకులతో పనిచేసే అదృష్టం నాకు లభించింది. సరైన సమయంలో సరైన దర్శకులను నేను కలుసుకోగలిగాను. ఒక్కో దర్శకుడు నాలో ఉన్న ఒక్కో కోణాన్ని బయటకు తీసి నన్ను స్టార్ సెలబ్రిటీని చేశారు. నేను అందరి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. ఇప్పటికి కూడా నేర్చుకుంటూనే ఉన్నాను. ఇకపోతే ఇప్పుడు కెరియర్ మొదటి నుంచి నాకు ఎన్నో నేర్పించిన వాళ్ళందరి దగ్గర నుంచి నేర్చుకున్న దానితోనే నేను ఈ సినిమా తీశాను. ముఖ్యంగా నా ఏవి నేను చూస్తూ ఉంటే నాలో ఉన్న తప్పులు అన్నీ కూడా కనిపించాయి. అందుకే ఎప్పుడూ కూడా నేను నా తప్పులను సరి చేసుకోవాలని చూస్తూ ఉంటాను. ఏ ఆర్ రెహమాన్ , కళానిధి మారన్ లకు ధన్యవాదాలు.

ఇంకా భయం పోలేదు..

ప్రకాష్ రాజ్ , ఎస్ జె సూర్య వంటి వారి నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను. నన్ను నమ్మి వీరంతా కూడా ఈ ప్రాజెక్టు లోకి వచ్చి నటించడం వల్లే నా కాన్ఫిడెంట్ మరింత పెరిగింది. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా లోపల కొంచెం భయంగా ఉంది. ముఖ్యంగా తమిళ ఆడియన్స్ కి మాత్రమే కాదు తెలుగు వాళ్లకు కూడా ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను అని చెప్పాడు.

- Advertisement -

తారక్ తో మల్టీ స్టారర్..

ఇకపోతే మల్టీ స్టారర్ సినిమాలపై కూడా స్పందించాడు. పవన్ కళ్యాణ్ , తారక్ ల గురించి మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో అంటే ఇష్టం అని యాంకర్ అడిగితే ..పవన్ కళ్యాణ్ ఇష్టమని , ఇతర హీరోల అభిమానులు తనను ద్వేషించొద్దు అంటూ కూడా సరదాగా చెప్పాడు.. మల్టీ స్టారర్ సినిమా చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారు అని అడిగితే తారక్ తో చేస్తానని చెప్పుకొచ్చాడు.. మొత్తానికైతే ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ సినిమా చేస్తానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు ధనుష్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు