Dhanush: మరో కొత్త సినిమా చేయబోతున్న ధనుష్‌?

Dhanush: తమిళ సినీ పరిశ్రమలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. అందులో చాలామంది హీరోలు తమ అద్భుతమైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అలాంటి స్టార్ హీరోలలో ధనుష్ ఒకరు. కేవలం నటుడిగానే కాకుండా గాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాత, రచయితగా తమిళ చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అతనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా తన సినిమా వచ్చిందంటే చాలు అభిమానులు విపరీతంగా పండగలు జరుపుకుంటారు. అతనికి అవార్డులు వచ్చిందంటే తెగ సంబరపడిపోతారు.

ధనుష్ అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. ఎప్పటికప్పుడు ఏదో ఒక సినిమాతో హీరో ధనుష్ తన అభిమానులను పలకరిస్తూనే ఉంటాడు. ధనుష్ చేసిన సినిమాలన్నీ హిట్ అవుతూనే ఉంటాయి. ధనుష్ వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ప్రస్తుతం ధనుష్ స్వీయ దర్శకత్వంలో తన 50వ సినిమాను రాయన్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

తాజాగా తాను కొత్త ప్రాజెక్టుకు కమిట్ అయ్యాడు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ధనుష్ మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ధనుష్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ధనుష్ ఒక కొత్త సినిమాకు ఓకే చెప్పాడట. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో నాగార్జున కీలక పాత్రలో కనిపించబోతున్నాడని భారీగా అంచనాలు ఉన్నాయి. ఆ సినిమా షూటింగ్ దశలో ఉండగానే విగ్నేష్ రాజా దర్శకత్వంలో ధనుష్ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడని వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

130 Dhanush Photos: Find Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat

విభిన్నమైన సినిమా కథలను తెరకెక్కించే సత్తా విగ్నేష్ కు ఉందని ధనుష్ సినిమాకు రెడీ అవుతున్నారు. మరి ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. ప్రస్తుతం ఈ విషయం తెలిసిన ధనుష్ అభిమానులందరూ అతడు ఎప్పుడెప్పుడు కొత్త సినిమాతో అభిమానుల ముందుకు వస్తాడా అని ఎదురుచూస్తున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు