Raayan Trailer : తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను అనౌన్స్ చేస్తూ వస్తున్నాడు.. ప్రస్తుతం అ సినిమాలు అన్ని సెట్స్ మీద ఉన్నాయి.. అందులో రాయన్ కూడా ఒకటి.. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించడమే కాదు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది.. నార్త్ మద్రాస్ బ్యాక్ డ్రాప్లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా వస్తోంది.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. తాజాగా ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు..
ధనుష్ సినిమాలు అంటే ఫుల్ మాస్ కంటెంట్ తో వస్తున్నాయి.. ఈ సినిమా నుంచి కొద్ది నిమిషాల ముందే ట్రైలర్ ను రిలీజ్ చేశారు.. నిన్న పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు ట్రైలర్ ఓ రేంజులో ట్రెండ్ అవుతుంది.. ఆ వీడియోలో మొత్తం మాస్ యాక్షన్ సీన్లతో ఉంది.. గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సన్నివేశాలతో విజువల్స్ అదిరిపోయాయి.. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు..
ఈ సినిమాలో ఎస్జే సూర్య, హీరో ధనుష్ స్టన్నింగ్ లుక్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ మూవీలో అపర్ణ బాలమురళి, దుషారా విజయన్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.ఈ మూవీలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, విష్ణువిశాల్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వ రాఘవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 50 వ గా వస్తోన్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఏసియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ విడుదక చెయ్యబోతుంది.. ధనుష్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. ఈ సినిమా తర్వాత మరో మూడు సినిమాల్లో నటిస్తున్నాడు..