‘3’MovieRelease : ఇక ఇప్పుడు ధనుష్ వంతు.. అండర్రేటెడ్ క్లాసిక్ రీ రిలీజ్ కి రెడీ..

‘3’MovieRelease : కోలీవుడ్ స్టార్ ధనుష్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. గత రెండేళ్లుగా మంచి ఫామ్ లో ఉన్న ధనుష్ హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు. తిరు, సార్, ఇప్పుడు రాయన్ సినిమాలతో ఏకంగా వంద కోట్ల వసూళ్లను అందుకున్నాడు. మధ్యలో కెప్టెన్ మిల్లర్ కూడా ఓ మోస్తరు ఫలితాన్ని అందుకుంది. ఇక త్వరలో కుబేర సినిమాతో కూడా ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా ధనుష్ నటించిన ఓ క్రేజీ సినిమా రీ రిలీజ్ కి రెడీ అవుతుందని సమాచారం. ధనుష్ నటించిన అండర్రేటెడ్ క్లాసిక్ సినిమాల్లో ‘3’ (Three) సినిమా కూడా ఒకటి ఈ సినిమా త్వరలో రీ రిలీజ్ కి రెడీ అవుతుంది.

Dhanush starrer "3" movie is going to re-release on September 14

అండర్రేటెడ్ క్లాసిక్ 3 రీ రిలీజ్ కి రెడీ…

ధనుష్ (Dhanush) నటించిన సినిమాల్లో కొన్ని సినిమాలు ప్లాప్ అయినా అండర్రేటెడ్ క్లాసిక్ లో ఒకటిగా నిలుస్తాయి. అందులో 3 సినిమా ఒకటి. ఈ సినిమాలో ధనుష్, శృతి హాసన్ (Shruthi hasan) హీరోహీరోయిన్లుగా నటించగా, ధనుష్ భార్య ఐశ్వర్య రజినీకాంత్ (Aishwarya Rajinikanth) దర్శకత్వం వహించారు. ఫీల్ గుడ్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా 2012 లో విడుదలైంది. అప్పట్లో సంచలనం రేపిన వై దిస్ కొలవరి సాంగ్ కూడా ఈ సినిమాలోనే ఉంటుంది. అయితే ఈ సినిమా అనుకోకుండా డిజాస్టర్ గా నిలిచింది. స్క్రీన్ ప్లే లోపం వల్లో, కథ అర్ధం కాకో, ఈ సినిమాను ఆడియన్స్ ఆదరించలేదు. కానీ ఆ తర్వాత ప్రేక్షకుల్లో టెలివిజన్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుని, అండర్రేటెడ్ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ కి రెడీ అవుతుంది.

- Advertisement -

ధనుష్ నటించిన 3 సినిమాను ఈ ఇయర్ సెప్టెంబర్ 14న రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అంతే కాదు, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి రీ రిలీజ్ చేస్తున్నారట. ఇక ఇంతకు ముందు ధనుష్ నటించిన రఘువరన్ బిటెక్ కు తెలుగులో అదిరిపోయే రెస్పాన్స్ లభించగా, ఇప్పుడు 3 సినిమాని కూడా అదే విధంగా ఆడియన్స్ ఆదరిస్తారో లేదో చూడాలి. ఇక ధనుష్ ప్రస్తుతం రాయన్ సినిమానే ఇంకా ప్రమోట్ చేస్తూ ఉండగా, త్వరలో మళ్ళీ కుబేర సినిమా షూట్ లో పాల్గొననున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు