Dhanush: రెండో పెళ్లి చేసుకోబోతున్న ధనుష్..?

 

Dhanush: కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. అందులో ధనుష్‌ ఒకడు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ధనుష్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. హీరోగా, రైటర్ గా, అలాగే గాయకుడిగా ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు.

Dhanush is getting huge remuneration for Ilayaraja biopic

- Advertisement -

ఇక ధనుష్ వ్యక్తిగత విషయానికి వస్తే…. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను ధనుష్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరు 2022లో విడాకులు తీసుకొని విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయం చాలా మందికి ఆశ్చర్యంగా అనిపించింది. వీరు ఇరువైపులా బంధువులతో చర్చలు జరిపి వారి విడాకుల నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. ఇక వీరు రెండేళ్ల తర్వాత కోర్టులో విడాకుల కోసం అప్పీలు చేసుకున్నారు.

ఇక వీరిద్దరూ కలుసుకునే అవకాశం అస్సలు లేదని అనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ధనుష్ తండ్రి ఎలాగైనా వీరిద్దరి నిర్ణయాన్ని మార్చాలని కస్తూరి రాజా చాలా ప్రయత్నాలు చేసి విఫలమయ్యారట. దీంతో ఆయన తన కొడుకు ధనుష్ కి రెండో పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ధనుష్ కి వివాహం చేయబోయే అమ్మాయి ఈసారి సినిమా ఇండస్ట్రీలో ఉండే అమ్మాయి వద్దని డిసైడ్ అయ్యి వారి బంధువుల అమ్మాయితో వివాహం చేయాలని అనుకుంటున్నారట. ఇక ఇందులో ఎంతవరకు ఉందో తెలియాల్సి ఉంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు