Martin : మోస్ట్ అవైటెడ్ కన్నడ పాన్ ఇండియా మూవీ ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్..

Martin : కన్నడ ఇండస్ట్రీ లో కెజిఎఫ్ సినిమా వచ్చిన తర్వాత ఇండస్ట్రీ రేంజ్ పెరిగిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత వచ్చిన కాంతారా, చార్లీ వంటి చిత్రాలు పాన్ ఇండియా వైడ్ గా మంచి హిట్ అయ్యాయి. ఇప్పుడు వరుస పాన్ ఇండియా సినిమాలు కన్నడ నుండి వస్తున్నాయి. అయితే గత ఏడాదిన్నర కాలంగా కన్నడ ఇండస్ట్రీలో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో “మార్టిన్” మూవీ ఒకటి. కన్నడ స్టార్ ధ్రువ సర్జా హీరోగా నటిస్తున్న ఈ సినిమా మూడేళ్ళుగా తెరకెక్కుతూనే ఉంది. ఇక మూడేళ్ళ కింద పొగరు అనే సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ ని కూడా పలకరించాడు ధ్రువ సర్జా. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు. ఇప్పడు చాలా రోజుల తర్వాత మార్టిన్ సినిమాతో ఆడియన్స్ ని పలకరించడానికి రెడీ అవుతున్నాడు.

Dhruv Sarja Martin Movie Trailer Update

మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్..

ఇక ధృవ సర్జా నటించిన మార్టిన్ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా, ఈ సినిమా నుండి ఆ మధ్య విడుదలైన టీజర్ ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఫైనల్ గా కన్నడ అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నా మార్టిన్ మూవీ ట్రైలర్ వచ్చేస్తుంది. ఏ.పీ. అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మార్టిన్ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ఆగస్ట్ 5, 2024 న సాయంత్రం 5:55 గంటలకు ట్రైలర్ 1 ను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు. ఇక ఈ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ధృవ సర్జా చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు.

- Advertisement -

దసరా కానుకగా మార్టిన్…

ఇక ధృవ సర్జా నటిస్తున్న మార్టిన్ సినిమాకి కథ స్వయంగా యాక్షన్ కింగ్ అర్జున్ అందించడం జరిగింది. ఇక అర్జున్ సర్జా మేనల్లుడే ధృవ సర్జా అని తెలిసిందే. ఇక మార్టిన్ సినిమాలో వైభవి శాండిల్య, అన్వేషి జైన్, సుకృత వాగ్లే, అచ్యుత్ కుమార్, నికితిన్ దీర్ లు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తుండడం విశేషం. అలాగే రవి బసూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ సినిమా కోసం కన్నడ అభిమానులే కాదు పాన్ ఇండియా వైడ్ గా మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఇక మార్టిన్ సినిమాను అక్టోబర్ 11, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు