Double Ishmart : నిరంజన్ రెడ్డి చార్మీని నమ్మి ఇన్ని కోట్లు పెట్టాడా..?

Double Ishmart : టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేనికి ఈ ఏడాది అంతగా కలిసి రాలేదు.. గత ఏడాది నుంచి వచ్చిన సినిమాలు అన్ని కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. ఇప్పుడు డబుల్ ఇష్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.. గతంలో వచ్చిన మాస్ మసాలా సినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. ఆ సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీ రాబోతుంది. ఆగష్టు 15 నా సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్ జనాలను బాగా ఆకట్టుకుంది.. కానీ సినిమా బిజినెస్ డిటైల్స్ మాత్రం ఫ్యాన్స్ ను టెన్షన్ పెట్టిస్తుంది..

ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను రూ.54 కోట్లకు నిర్మాత నిరంజన్ రెడ్డి కొనుగోలు చేయగా.. హిందీ రైట్స్ కు రూ.6 కోట్లకు అమ్ముడయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఓటీటీ రైట్స్ ను కూడా రూ.33 కోట్లకు తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోఅమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది.. ఆడియో రైట్స్ ను రూ.9 కోట్లకు ఆదిత్య మ్యూజిక్ కు నిర్మాత ఛార్మి కౌర్ సేల్ చేసిన విషయం తెలిసిందే.. ఇక జీఎస్టీ కూడా 9 కోట్లను చార్మీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆమె దగ్గర అంత పెట్టే ఛాన్స్ లేనట్లు కనిపిస్తుంది..

Did Niranjan Reddy trust Charmi and put so many crores..?
Did Niranjan Reddy trust Charmi and put so many crores..?

ఇప్పటికే చార్మీ సినిమాకు భారీగానే ఖర్చు పెట్టింది.. ఒకవేళ ఎక్కడైన అప్పు చేసి పెట్టినా లాస్ అవ్వకుండా ఉంటుందని చెప్పలేము.. సినిమా హిట్ అయితే తప్ప ఈ పరిస్థితుల నుంచి బయట పడే దారి కనిపించలేదు. సినిమా హిట్ అయినా టోటల్ గా 120 కోట్లకు పైగా వసూల్ చేస్తేనే చార్మీ, నిరంజన్ రెడ్డి సేఫ్ లేకుంటే మాత్రం నష్టాలను చవిచూడాలి.. ఈ సినిమాకు ఇప్పటివరకు పాజిటివ్ టాక్ ను అందుకుంది.. గతంలో వచ్చిన సినిమా సూపర్ హిట్ అయ్యింది. మరి ఈ సినిమా కూడా హిట్ అవుతుందేమో చూడాలి.. ఏది ఏమైనా సినిమా హిట్ అయ్యేవరకు చార్మీ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి లాగా కనిపిస్తుంది.. ఇక ఈ సినిమాలో భాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక సినిమా ఓపెనింగ్స్ బాగానే ఉన్నట్లు తెలుస్తుంది.. ఇక సినిమా హిట్ అవుతుందో లేదో తెలియాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చెయ్యాల్సిందే..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు