Jr Ntr : ఎన్టీఆర్ జీవితంలో ఆ ఇద్దరే ప్రత్యేకం.. ఎందుకో తెలుసా?

Jr Ntr : గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. కేరీర్ పరంగా దూసుకుపోతున్నారు. అటు సినిమాల పరంగా కానీ, వ్యక్తిగతంగా అన్నీ కలిసిస్తున్నాయి.. తారక్ నటిస్తున్న సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.. ఆ సినిమాలకు జనాల్లో అంతగా డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు తారక్ సినిమాలు కూడా ఆ రేంజులో ఉన్నాయి.. సినిమాల మాట పక్కన పెడితే ఎన్టీఆర్ జీవితంలోకి ఆ ఇద్దరు వచ్చాక అంతా మారిపోయిందని ఎన్టీఆర్ చాలా సందర్భాల్లో చెప్పాడు.. అస్సలు ఆ ఇద్దరు ఎవరు అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.. ఆ ఇద్దరు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎన్టీఆర్ లైఫ్ లోకి వచ్చిన ఆ ఇద్దరు ఎవరో కాదు ఎన్టీఆర్ కొడుకులే.. ఎన్టీఆర్ కు ఇద్దరు కొడుకులు అనే సంగతి తెలిసిందే. తారక్ పెద్ద కొడుకు పేరు అభయ్ రామ్, చిన్న కొడుకు పేరు భార్గవ్ రామ్.. అయితే, ఆయన పెద్ద కొడుకు పుట్టిన తర్వాత తారక్ కు కలిసొచ్చిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 2014కు ముందు ఎన్టీఆర్ కు కొన్నేళ్ల పాటు వరుస షాకులు తగిలాయి. తారక్ నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచాయనే సంగతి తెలిసిందే.. అభయ్ పుట్టిన తర్వాత వచ్చిన సినిమాలు అన్నీ కూడా మంచి హిట్ ను అందుకున్నాయి.. ఇక అతని రేంజ్ కూడా పూర్తిగా మారిపోయింది.

Did NTR's life change completely bechouse of those two?
Did NTR’s life change completely bechouse of those two?

ఆ తర్వాత వచ్చిన సినిమాలు మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి. ఆయన సినిమాల ఎంపిక కూడా కొత్తగా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథలపై దృష్టి పెడుతూ కెరీర్ పరంగా ఎదుగుతున్నారు. ఇతర హీరోల ఫ్యాన్స్ సైతం మెచ్చుకునే విధంగా ఫ్యాన్స్ అడుగులు వేస్తున్నారు.. తారక్ రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలు సృష్టించి బాక్సాఫీస్ ను ఊహించని స్థాయిలో షేక్ చేస్తారని ఫ్యాన్స్ చెబుతున్నారు.. సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాతో పాటుగా బాలీవుడ్ లో వార్ 2 సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేస్తున్నాడు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు