Khushi: పవన్ కళ్యాణ్ తాగడం వలనే ఖుషి సినిమా హిట్ అయిందా.?

Khushi: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఆ సినిమా తర్వాత వరుసగా హిట్ సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు. కొత్త దర్శకులకి అవకాశం కూడా ఇచ్చాడు. అయితే పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో చేసిన ఎక్కువ సినిమాలు రీమేక్ సినిమాలు మాత్రమే. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకులు ఒరిజినల్ ఫిలిమ్స్ చేశారు. పవన్ కళ్యాణ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఖుషి. ఎస్ జె సూర్య ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.

ఖుషి సినిమా తమిళ్లో విజయ్ హీరోగా జ్యోతిగా హీరోయిన్ గా నటించారు. ఇదే పేరుతో తెలుగులో ఖుషి సినిమా తెరకెక్కించారు. అయితే ఒరిజినల్ స్కంటే కూడా రీమేక్ సినిమాలు అతి తక్కువగా వర్క్ అవుట్ అవుతూ ఉంటాయి. అలా వర్కౌంటు ఎన్ని సినిమాల్లో ఖుషి సినిమా ఒకటి. ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. కళ్యాణ్ కూడా చాలా స్టైలిష్ గా కనిపిస్తాడు. చాలా యాక్షన్ సీక్వెన్స్ పవన్ కళ్యాణ్ ని సినిమాలో డిజైన్ చేశాడు. అలానే ఫస్ట్ సాంగ్ హిందీ సాంగ్ ఉండాలని కూడా పవన్ ఛాయిస్ అని మార్కండ్ కే వెంకటేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

Pawan Kalyan's Kushi

- Advertisement -

ఖుషి సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఆ సినిమా తర్వాతే పవన్ కళ్యాణ్ జానీ సినిమాకి డైరెక్షన్ చేశాడు. ఇక ఖుషి సినిమా రీ రిలీస్ అప్పుడు కూడా మంచి రెస్పాన్స్ సాధించుకుంది. పవన్ కళ్యాణ్ కెరియర్ లో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీస్ లో ఖుషి సినిమా ఒకటి అని చెప్పొచ్చు. అయితే ఖుషి సినిమా హిట్ అయిన వెంటనే సితార అనే ఒక పత్రిక పవన్ కళ్యాణ్ ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళింది. ఆ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ అలీతో కలిసి తాగే సీన్స్ చేయటం వల్లనే సినిమా హిట్ అయిందని ఆ పత్రిక అడిగింది. దానికి సమాధానంగా పవన్ కళ్యాణ్ కేవలం ఒక సీన్ వలన సినిమా హిట్ అయింది అంటే నేను నమ్మను అంటూ చెప్పుకొచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు