Tripti Dimri : బాబోయ్.. త్రిప్తి డిమ్రి వేసుకున్న డ్రెస్స్ కాస్ట్ అన్ని లక్షలా?

Tripti Dimri : త్రిప్తి డిమ్రి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు… బాలీవుడ్ లో గత ఏడాది విడుదలై భారీ విజయాన్ని అందుకున్న యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయాయి.. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది.. ఇక సోషల్ మీడియాలో పాప ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆమె షేర్ చేసే ఫోటోలు ఎంతగా వైరల్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం.. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతుంది.. ఆ వీడియో ఆమె వేసుకున్న డ్రెస్స్ ధర సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది..

ప్రముఖ డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రి నటించింది. జోయా అనే పాత్రలో స్క్రీన్‌పై కనిపించింది.. ఆ సినిమాలో త్రిప్తి కనిపించింది కొద్ది సేపే అయిన ఆ పాత్రకు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.. రణ్‌బీర్‌ – త్రిప్తి మధ్య వచ్చే సీన్స్ సినిమాకు హైలెట్ అయ్యాయి.. ఈ సినిమాలో అమ్మడు పెర్ఫార్మన్స్ కు ఫిదా అయిన మేకర్స్ తమ సినిమాల్లో తీసుకోవాలని క్యూ కడుతున్నారు.. ఇక ఇటీవల భారీగా రెమ్యూనరేషన్ ను పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

tripti dimri dress coost viral in social media
tripti dimri dress coost viral in social media

ఇక సినిమాల విషయానికొస్తే.. ‘భూల్ భులయా’లో చిత్రంలో నటిస్తుంది. అందులో స్పెషల్ రోల్‌ నటిస్తున్నందుకు ఆమె కోటి రూపాయలు రెమ్యునరేషన్‌గా తీసుకుంటుందట. అలాగే ఈ అమ్మడు బాలీవుడ్ లో బ్యాడ్ న్యూజ్ అనే సినిమాలో నటిస్తుంది.. ఆ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు.. ఆ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ఈ సినిమా హీరో విక్కీ కౌశల్ కూడా హాజరయ్యారు.. ఈ ఈవెంట్ లో త్రిప్తి బ్లాక్ డ్రెస్సులో మెరిసింది.. ఆ డ్రెస్సు చూడటానికి చాలా సింపుల్ గా ఉంది.. కానీ దాని ధర మాత్రం లక్షల్లో ఉంటుందని తెలుస్తుంది.. ఆ డ్రెస్సు ధర అక్షరాల రూ. 10 లక్షలు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.. దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించిందని తెలుస్తుంది.. ప్రస్తుతం ఆ డ్రెస్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు