Vijay Devarakonda : విజయ్ దేవరకొండ తల్లి ఓ సినిమాలో నటించింది అని మీకు తెలుసా?

Vijay Devarakonda : సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సక్సెస్ అయిన స్టార్ హీరోలలో ఒకరు విజయ్ దేవరకొండ.. ఈయన సినిమాలకు మాత్రమే కాదు.. ఆయనకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. నువ్విలా సినిమాలో చిన్న పాత్రలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు. పెళ్లి చూపులు సినిమాతో మంచి టాక్ ను సొంతం చేసుకున్నాడు.. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు.. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు.. అయితే ఈయన తల్లి ఓ సినిమాలో నటించిందని చాలా మందికి తెలియదు.. ఆ సినిమా ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా భారీ అవకాశాలను దక్కించుకుంటూ సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియన్ సినిమా షూట్‌లలో బిజీగా గడుపుతున్నాడు విజయ్ దేవరకొండ. తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా సినిమాల్లో నటిస్తున్నాడు.. ఇటీవల బేబీ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నాడు. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ.. విజయ్ దేవరకొండ తన తల్లితో కలిసి ఓ సినిమాలో నటించాడు.. ఆ సినిమా ప్లాప్ అయినా కూడా ఆమె పాత్రకు మార్కులు పడ్డాయి..

Did you know that Vijay Devarakonda's mother acted in a movie?
Did you know that Vijay Devarakonda’s mother acted in a movie?

రౌడీ హీరో తన తల్లితో కలిసి డియర్ కామ్రేడ్ సినిమాలో నటించాడు.. ఆ సినిమాలో ఆమె కాలేజ్ లెక్చరర్ పాత్రలో నటిస్తుంది. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ఈ సినిమాల్లో విజయ్ దేవరకొండ తల్లి కూడా చిన్న పాత్రలో మెరిసింది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవ్వడంతో అంత షాక్ అవుతున్నారు. సినిమా సక్సెస్ అవ్వలేదు అన్న విషయం తెలిసిందే.. విజయ్ సినిమాల విషయానికొస్తే… మొన్న కల్కి సినిమాలో ఓ పాత్రలో మెరిసాడు.. ఇప్పుడు ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు