Sukumar: “పుష్ప 2” టీజర్ లో డైరెక్టర్ లాజిక్స్ క్రియేటివిటీని గమనించారా..?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన చిత్రం “పుష్ప ది రైజ్”. పాన్ ఇండియా రేంజ్ లో భారీ స్థాయిలో విడుదలైన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ అందుకున్నాడు బన్నీ. దీంతో త్వరలో రాబోతున్న సెకండ్ పార్ట్ (పుష్ప ది రూల్) పై రోజు రోజుకి ఆసక్తి పెరిగిపోతుంది.

ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం సాయంత్రం పుష్ప ది రూల్ కి సంబంధించిన ఒక స్పెషల్ వీడియో ని విడుదల చేసింది చిత్ర బృందం. ఈ వీడియో మూవీ పై మరింత హైప్ ని క్రియేట్ చేసింది. “వేర్ ఇజ్ పుష్ప” అన్న సస్పెన్స్ తో టీజర్ ని మొదలుపెట్టి జనాల ఎమోషన్స్ తో క్యారీ చేశాడు సుకుమార్. ఆ తరువాత పుష్ప దిమ్మతిరిగే ఎంట్రీ తో ముగించాడు. ఇక ఈ టీజర్ లో కొన్ని షాట్స్ సుకుమార్ క్రియేటివిటీని నిరూపించాయి. అవేంటంటే.. తిరుపతి జైలు నుంచి తప్పించుకున్న పుష్పపై పోలీసులు కాల్పులు జరుపుతారు. దాంతో పుష్ప మద్దతుదారులు అల్లర్లు చేస్తూ ఉంటారు.

ఇక ఈ అల్లర్లని కవర్ చేస్తూ ఓ రిపోర్టర్ గా దివి కనిపిస్తుంది. అప్పుడు ఓ ఆందోళనకారుడు విసిరిన రాయి నుండి టీవీలో రిపోర్టు చేస్తున్న దివి తప్పుకున్నట్లు చూపిస్తారు. అదేలా సాధ్యమని ప్రేక్షకులు ఫీల్ అయ్యేలోపే ట్విస్ట్ రివిల్ చేశాడు సుక్కు. రిపోర్టర్ దివి టీవీ షో రూమ్ ముందు నిల్చని అల్లర్లని కవర్ చేస్తూ ఉంటుంది. షో రూమ్ లో ఉన్న టీవీలో ఆమె లైవ్ ప్రసారం అవుతూ ఉంటుంది. ఆ విధంగా ఒకే రియాక్షన్ టీవీలో, రియల్ గా కవర్ చేశారు. అది సుకుమార్ క్రియేటివిటీకి నిదర్శనం.

- Advertisement -

ఇక అటవీ ప్రాంతంలో పులుల జాడ తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేసిన నైట్ విజన్ కెమెరాల్లో పుష్ప చిక్కాడని చెప్పడమే గొప్ప ఎలివేటింగ్ పాయింట్. ఇక పులి – అల్లు అర్జున్ మీద తీసిన ఈ షాట్ మాస్ ఎలివేషన్స్ లో నెక్స్ట్ లెవెల్. నైట్ విజన్ కెమెరాలు మనుషులు, జంతువుల కళ్ళు భయంకరంగా కనిపిస్తాయి. ఆ ఎఫెక్ట్ ని హీరో క్యారెక్టర్ ని ఎలివేట్ చేయడానికి, పుష్ప చాలా డేంజరస్ అని చెప్పడానికి వాడాడు సుకుమార్.

“అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే అది పులి వచ్చిందని అర్థం.. అదే పులి రెండు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్థం” అనే డైలాగ్ తో పుష్ప ఎంత డేంజరస్ అన్నది సామాన్యులకు కూడా అర్థం అవుతుంది. పుష్ప బ్రతికే ఉన్నాడని న్యూస్ ఛానల్ లో చెప్పినప్పుడు ఉత్కంఠగా చూస్తున్న అభిమానుల ముఖాలపై తీసిన షాట్ టీజర్ లో బాగా ఎలివేట్ అయింది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు