Dilraj: భార్యతో కలిసి వెకేషన్ కి వెళ్లిన దిల్ రాజు.. ఫొటోస్ వైరల్..!

Dilraj: టాలీవుడ్ పాపులర్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజు మనందరికీ సుపరిచితమే. ఎన్నో చిత్రాలకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించి మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు దిల్ రాజు. ఇటీవల గుంటూరు కారం, లవ్ మీ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు దిల్ రాజు.

ఇక ఈ రెండు కూడా దిల్ రాజుకి నిరాశనే మిగిల్చాయి. దీంతో ప్రొడక్షన్ పై ఆశలు చంపుకోకుండా వరుసగా మంచి మంచి కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల కి వినోదాన్ని పంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే దిల్ రాజు పర్సనల్ విషయానికి వస్తే.. తన మొదటి భార్య చనిపోవడంతో రెండవ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తేజస్విని అనే అమ్మాయిని దిల్ రాజు రెండవ వివాహం చేసుకున్నాడు.

Dil Raju went on vacation with his wife.. Photos viral
Dil Raju went on vacation with his wife.. Photos viral

ఇక రెండవ వివాహం దగ్గర నుంచి దిల్ రాజు పై ఏదో ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. వీటిపై దిల్ రాజు స్పందించి ఖండించినప్పటికీ ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక ఇదిలా ఉంటే తాజాగా తన భార్య తేజస్వినితో కలిసి దిల్ రాజు వెకేషన్ కి వెళ్ళారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశాడు దిల్ రాజు. ప్రజెంట్ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు