Diljit Dosanjh : ఎనిమిదేళ్ళ వయసులోనే అమ్మాయి రచ్చ…. ఇంట్లోంచి పారిపోయిన పాపులర్ సింగర్

Diljit Dosanjh : పాపులర్ పంజాబీ సింగర్ దిల్జిత్ దోసాంజ్ ఓ అమ్మాయి గురించి జరిగిన రచ్చతో ఎనిమిదేళ్లకే ఇంట్లో నుంచి పారిపోయాడట. దిల్జిత్ దోసాంజ్ జీవితంలో మరచిపోలేని సంఘటనగా మిగిలిన ఆ స్టోరీ ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.

అమ్మాయికి ప్రపోజ్ చేసి చిక్కుల్లో

గత కొన్ని రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్న పేరు దిల్జిత్ దోసాంజ్. ఆయన గురించి నిన్న మొన్నటిదాకా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదనే చెప్పాలి. కానీ తాజాగా కల్కి 2898 ఏడీలో భైరవ గీతం అనే ఫస్ట్ సాంగ్ తో ప్రభాస్ అభిమానుల మనసులో డార్లింగ్ గా స్థానం సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి దిల్జిత్ దోసాంజ్ గురించి ఎలాంటి వార్త బయటకు వచ్చినా తెలుగు మూవీ లవర్స్ కూడా తెలుసుకోవడానికి ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. ఇక దిల్జిత్ దోసాంజ్‌కి సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా దిల్జిత్ దోసాంజ్ ఒక పెద్ద విషయాన్ని రివీల్ చేసారు. ఒకసారి తాను ఇంటి నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్నానని, ఆ సమయంలో ఏం జరిగిందో నేరుగా చెప్పాడు.

దిల్జిత్ దోసాంజ్ మాట్లాడుతూ నాకు ఎనిమిదేళ్ల వయసులో స్కూల్‌లో ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాను. నా ప్రేమ గురించి ఆ అమ్మాయితో చెప్పమని స్నేహితులు బలవంతం చేశారు. నేను ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి పెళ్లి చేసుకుందాం అన్నాను. దీంతో ఆ అమ్మాయి నాపై డైరెక్ట్ గా టీచర్‌కు ఫిర్యాదు చేయడంతో వారు తల్లిదండ్రులను పాఠశాలకు తీసుకురావాలని ఆదేశించారు. ఆ తర్వాత నేను భయపడి ఇంట్లో నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్నాను. అంతేకాదు ఫ్రిజ్‌లోంచి కొన్ని పండ్లు తీసుకుని సైకిల్‌పై ఇంటి నుంచి పారిపోయాను. ఊరు విడిచి వెళుతుండగా కొందరు నన్ను పట్టుకుని ఇంటికి పంపించారు. ఆ తర్వాత కడుపునొప్పి అని మూడు రోజులు స్కూల్‌కి వెళ్లలేదు.” అంటూ చిన్న వయసులో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ ను గుర్తు చేసుకున్నారు.

- Advertisement -

Diljit Dosanjh Makes Punjabi Music History & More Canada Industry News

రూమర్స్ తక్కువేం కాదు

దిల్జిత్ దోసాంజ్ పై రూమర్స్ కూడా తక్కువేమీ కాదు. ఈ స్టార్ సింగర్ ఓ ఇండో అమెరికన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని, ఈ జంటకు ఒక కొడుకు కూడా ఉన్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ దిల్జిత్ అవేమీ పట్టించుకోడు. పర్సనల్ లైఫ్ గురించి ఎక్కడా ప్రస్తావించడు. ఎవరైనా ప్రశ్నించినా తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకుంటాడు. రీసెంట్ గా ఓ పాడ్ కాస్ట్ లో ఎవరినైనా ప్రేమిస్తున్నారా? అనే ప్రశ్నను నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అంటూ మరో ప్రశ్న ఆడగకుండా నోరు మూయించాడు.

హాలీవుడ్ అరంగేట్రం 

అతని అసమానమైన సింగింగ్ ప్రతిభతో అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించుకున్న దోసాంజ్‌ పాలీవుడ్ నుండి హాలీవుడ్‌ లోకి అడుగు పెట్టబోతున్నాడు. జిమ్మీ ఫాలన్ హోస్ట్ చేస్తున్న ది టునైట్ షోలో తాను కనిపిస్తానని దిల్జిత్ ఉత్సాహంగా ప్రకటించాడు. ఇక ఇప్పుడు కల్కి ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ టాప్ సింగర్ దగ్గరైపోయాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు