Dimple Hayathi: అతనితో సీక్రెట్‌ రిలేషన్‌ లో ఉన్న డింపుల్‌ ?

Dimple Hayathi: డింపుల్ హయాతి ఈ బ్యూటీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకుంది ఈ భామ. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన గద్దలకొండ గణేశ్ సినిమాలో ఐటెం సాంగ్ లో ఈ బ్యూటీ జర్ర జర్ర అంటూ కుర్ర కారును ఉపేసింది. ఈ పాట అప్పట్లో పెద్ద సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఈ పాటలో తన అద్భుతమైన నటన, డ్యాన్స్ తో పాటు అందచందాలను ఆరబోసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక రీసెంట్ గా ఈ భామ కిలాడి చిత్రంలో ప్రతి ఒక్క ప్రేక్షకుడి మనసు దోచుకుంది. ఈ బ్యూటీ ఇంకా గద్దలకొండ గణేష్ సినిమా కన్నా ముందు గల్బ్ చిత్రంలో నటించింది. ఈ సినిమాకి సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా నిజజీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత డింపుల్ AL విజయ్ దర్శకత్వంలో వచ్చినటువంటి అవినీతి సినిమాలో కీలకపాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదగాలంటే చాలా కష్టపడాలి.

అదే కోవలో వరుసగా ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉండాలి. ఈ క్రమంలోనే డింపుల్ హయాతి కూడా ఇదే చేస్తుంది. సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉంటూ వరుసగా ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ సమయంలోనే డింపుల్ హయాతి సోషల్ మీడియాలో లేటెస్ట్ గా ఓ ఫోటో అప్డేట్ చేసింది. ఈ ఫోటోలో డింపుల్ వితౌట్ మేకప్ తో చాలా నేచురల్ గా కనిపించింది. ఈ ఫోటోలు చూసిన చాలామంది డింపుల్ ముఖానికి సర్జరీ చేయించుకున్నట్టుగా ఉందని నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

ఇక ఇదంతా పక్కకు పెడితే…డింపుల్ హయాతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని సమాచారం. హైదరాబాద్‌ కు చెందిన ఓ బడా వ్యాపారితో డింపుల్ హయాతి రిలేషన్‌ లో ఉందట. సీక్రెట్‌ గా ఈ రిలేషన్‌ నడిపిస్తోందట డింపుల్ హయాతి. అయితే.. టాలీవుడ్‌ సర్కిల్స్‌ లో ఈ విషయం వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు