Director Arrest : హత్య కేసులో డైరెక్టర్ అరెస్ట్… 20 ఏళ్ల తరువాత కూడా వదలని పోలీసులు

Director Arrest : హత్యకేసులో 20 ఏళ్లుగా పోలీసులకు దొరకకుండా పారిపోయిన ఓ దర్శకుడు ఎట్టకేలకు ఖాకీ వలలో పడ్డాడు. సీసీబీ పోలీసులు గజేంద్ర అలియాస్ గజను అరెస్ట్ చేశారు. నిందితుడు గజేంద్ర కన్నడ చిత్ర పరిశ్రమలోనే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రెండు సినిమాలు చేశాడు. మరి ఇన్నేళ్ళు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించిన ఈ డైరెక్టర్ పోలీసుల చేతికి ఎలా చిక్కాడు? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

హత్య కేసులో జైలుకెళ్లిన గజేంద్ర

2004లో బెంగళూరులోని విల్సన్ గార్డెన్‌లో ఓ రౌడీ షీటర్‌ను నరికి చంపారు. ఈ హత్య కేసులో చంద్రప్పతో పాటు అల్యూమినియం బాబుతో పాటు దర్శకుడు గజేంద్ర కూడా నిందితుడిగా ఉన్నాడు. ఆయనను ఎఫ్ఐఆర్ లో 8 వ నిందితుడిగా చేర్చారు పోలీసులు. హత్య కేసులో అరెస్టయిన గజేంద్రకు కోర్టు విచారణ అనంతరం దోషిగా తేలడంతో 1 సంవత్సరం శిక్ష విధించింది. ఒక సంవత్సరం జైలు జీవితం గడిపిన తర్వాత గజేంద్ర బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆ తరువాతే సినిమాలో వచ్చినట్టుగా పెద్ద ట్విస్ట్ ఎదురైంది పోలీసులకు.

Director Arrest: ಕೊಲೆ ಕೇಸ್​​ನಲ್ಲಿ 20 ವರ್ಷಗಳಿಂದ ತಲೆ ಮರೆಸಿಕೊಂಡಿದ್ದ ಸ್ಯಾಂಡಲ್​ವುಡ್ ನಿರ್ದೇಶಕ ಅರೆಸ್ಟ್​! - Vistara News

- Advertisement -

20 ఏళ్లుగా పోలీసుల చేతికి చిక్కని డైరెక్టర్

బెయిల్ బయటకు వచ్చిన తర్వాత గజేంద్ర తన డైరెక్టర్ తెలివి తేటలను బయట పెట్టాడు. బెయిల్ షరతుల ప్రకారం కొన్నాళ్లు కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆయన పరారీలో ఉన్నాడని గమనించారు పోలీసులు. అయితే ఎంత వెతికినా గజేంద్ర దొరకలేదు. అయినప్పటికీ పోలీసులు వదిలిపెట్టకుండా వెతకడంతో దాదాపు రెండు దశాబ్దాల తరువాత దొరికిపోయాడు. 20 ఏళ్లుగా పోలీసులకు చిక్కని గజేంద్ర ఎట్టకేలకు దొరకడంతో ప్రస్తుతం సీసీబీ పోలీసులు గజేంద్రను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అరసయ్య శిష్యుడు గజేంద్ర అలియాస్ గజ గతంలో పూతని పవర్, రుద్ర అనే కన్నడ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అంతే కాకుండా తమిళంలో ఓ రెండు సినిమాలు చేశానని చెప్పుకొచ్చాడు.

దర్శన్ కూడా శాండల్ వుడ్డే

రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన నటుడు దర్శన్ కూడా శాండల్ వుడ్డే. తాజాగా గజేంద్ర అరెస్ట్ కావడంతో మరోసారి ఈ నటుడి పేరు తెరపైకి వచ్చింది. దర్శన్ అండ్ గ్యాంగ్ పై ఇప్పుడు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ హత్యపై పలు కోణాల్లో విచారణ జరిపిన పోలీసులు త్వరలో నటుడు దర్శన్ అండ్ గ్యాంగ్‌పై చార్జిషీట్ సమర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

17 మంది నిందితులు, 37 రోజులు.. ఛార్జిషీటుకు రెడీ

రేణుకాస్వామి హత్య జరిగి 37 రోజులు గడిచాయి. దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడ సహా 17 మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని విచారించి జైలుకు తరలించారు. ప్రస్తుతం కేసుకు అవసరమైన ప్రత్యక్ష సాక్షులు, పరోక్ష సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడం ప్రారంభించారు. హత్యపై ఇప్పటికే 30 మందికి పైగా వాంగ్మూలాలు ఇచ్చారు. 33 సీసీటీవీ ఫుటేజీలు, 180కి పైగా ఆధారాలు సేకరించి వీలైనంత త్వరగా కోర్టుకు చార్జ్ షీట్ సమర్పించేందుకు సిద్ధమయ్యారు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. విచారణ పూర్తి చేసి త్వరలో చార్జిషీటును కోర్టుకు సమర్పిస్తామని పోలీస్ కమిషనర్ బి. దయానంద్ అన్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు