Director : డ్రగ్స్ ఇచ్చి లైంగిక వేధింపులు… బయట పడుతున్న ప్రముఖ డైరెక్టర్ చీకటి బాగోతం

Director : గత కొన్ని రోజులుగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ మలయాళ డైరెక్టర్ కేసు తాజాగా మరో కీలక మలుపు తిరిగింది. ధర్మాసనం ఎదుట బాధితురాలు ఆ డైరెక్టర్ కు డ్రగ్స్ అలవాటు ఉందని, తనను డ్రగ్స్ ఇచ్చి లైంగికంగా వేధించాడని షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాకుండా తనను కేసు వాపసు తీసుకోవాలని బెదిరించారని, దానికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయంటూ బాంబ్ పేల్చింది.

డ్రగ్స్ ఇచ్చి రేప్

ప్రముఖ మలయాళ డైరెక్టర్ ఒమర్ లులు లైంగిక వేధింపుల కేసులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజా సమాచారం ప్రకారం బాధితురాలు అతను డ్రగ్స్ ఇచ్చి తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. MDMA కలిపిన డ్రింక్‌ ను తాగించి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడనే షాకింగ్ విషయాన్ని తాజాగా బయట పెట్టింది. అంతేకాకుండా ఒమర్ పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి తనను వాడుకున్నాడని, తన రాబోయే సినిమాలో పాత్ర చేస్తానని హామీ ఇచ్చి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు పేర్కొంది. డైరెక్టర్‌తో సినిమా గురించి చర్చించేందుకు తనను హోటల్‌కు పిలిచారని, అయితే ఆ సమయంలోనే మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారని బాధితురాలు పిటిషన్‌లో పేర్కొంది.

కాగా ఒమర్ లులు పిటిషన్‌లో ఆమెను ప్రతివాదిగా చేర్చేందుకు జస్టిస్ సీఎస్ డయాస్ నేతృత్వంలోని ధర్మాసనం అనుమతించింది. అయితే అతను బెయిల్ పై బయటకొస్తే సాక్ష్యాలను తారుమారు చేయడమే కాకుండా తన ప్రాణాలకు హాని ఉందని ఆమె న్యాయమూర్తి ముందు ఆవేదనను వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఒమర్ బెయిల్‌పై విచారణను కోర్టు జూలై 22కి వాయిదా వేసింది. ఒమర్‌కు డ్రగ్స్ అలవాటు ఉందని బాధితురాలు తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ వాంగ్మూలం ఆధారంగా పలరివట్టం పోలీసులు తొలుత కేసు నమోదు చేసినప్పటికీ, నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నెడుంబస్సేరి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

- Advertisement -

Omar Lulu's 'Nalla Samayam' to release on OTT as HC annuls excise case, Nalla Samayam, OTT release date, Omar Lulu new movie, Excise case, mollywood, movies latest news

బాధితురాలికి బెదిరింపులు

సమాచారం ప్రకారం ఒమర్ తన డ్రైవర్ నాసిల్ అలీ, స్నేహితుడు ఆజాద్, మరికొందరు కేసును ప్రైవేట్‌గా పరిష్కరించుకోవాలని తనను బెదిరించారని బాధితురాలు ఆరోపించింది. మొబైల్ సంభాషణల రికార్డింగ్‌లను సాక్ష్యంగా కోర్టుకు సమర్పించేందుకు బాధితురాలు అంగీకరించినట్టు తెలుస్తోంది

పాపులర్ డైరెక్టరే

డైరెక్టర్ ఒమర్ లులు రిన్షి ఒమర్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఈ దర్శకుడు ఒరు అదార్ లవ్, చంక్జ్, ధమాకా, హ్యాపీ వెడ్డింగ్, చంక్జ్, కూడాషా, క్రీగ్ ఇమ్ ఫ్రైడెన్, హంటెడ్ వంటి చిత్రాలను రూపొందించి పాపులర్ అయ్యాడు. అతని చిత్రం ఒరు అదార్ లవ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ ‘వింక్’ స్టింట్ కారణంగా విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ చిత్రంలో రోషన్ అబ్దుల్ రహూఫ్, నూరిన్ షెరీఫ్, సియాద్ షాజహాన్, ప్రదీప్ కొట్టాయం, రోష్నా ఆన్ రాయ్, అనీష్ జి మీనన్, శివాజీ గురువాయూర్, హరీష్ కనరన్ ముఖ్య పాత్రలు పోషించారు. 2019లో థియేటర్లలో రిలీజై, మంచి ఆదరణను దక్కించుకుంది. అదే డైరెక్టర్ ఇప్పుడు లైంగిక వేధింపుల కేసులో చిక్కుకోవడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు