Director Maruthi : మారుతీకి పెద్ద ప్రెజరే..?!

Prabhas Raja Saab Movie : మారుతీ.. టాలీవుడ్లో ఉన్న మిడ్ రేంజ్ డైరెక్టర్స్ లో ఒకడు. ‘ఈ రోజుల్లో’ ‘బస్ స్టాప్’ ‘కొత్త జంట’ ‘భలే భలే మగాడివోయ్’ వంటి సినిమాలతో లో- బడ్జెట్ సినిమాలకి మారుతీ కేర్ ఆఫ్ అడ్రెస్ అనిపించుకున్నాడు. అవి సక్సెస్ అయ్యాయి. ఆ తర్వాత వెంకటేష్ తో ‘బాబు బంగారం’ చేసి టాప్ లీగ్లోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అది బెడిసికొట్టింది. ఆ తర్వాత చేసిన ‘శైలజారెడ్డి అల్లుడు’ కూడా అంతే..! ఫ్లూక్ లో ‘మహానుభావుడు’ ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలు ఆడాయి కానీ.. అవి మారుతీని డైరెక్టర్ గా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లలేదు. అతని మార్కెట్ ను కూడా పెంచలేదు..! గోపీచంద్ తో చేసిన ‘పక్కా కమర్షియల్’ సినిమా అయితే ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్ష పెట్టింది.

అవన్నీ పక్కన పెడితే.. మారుతీ సినిమాలో ఆకట్టుకునే అంశాలు కూడా పెద్దగా ఏవీ ఉండవు. సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే పెంట అంతటినీ తీసుకొచ్చి సినిమాల్లో పేరడీలు చేసి ‘కామెడీ అనుకోమంటాడు’ మారుతీ. అది నవ్వు రాకపోగా… విసిగిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే క్రింజ్ అనే పదానికి పర్ఫెక్ట్ డెఫినిషన్ గా మారుతీ సినిమాలని చెప్పుకోవచ్చు. ‘గీత..’ కాంపౌండ్లో ఉంటున్నప్పటికీ అల్లు అర్జునే ఇప్పటివరకు ఇతనికి ఛాన్స్ ఇచ్చింది లేదు.

అలాంటిది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇతనికి ఛాన్స్ ఇచ్చి ‘రాజా సాబ్’ చేస్తున్నాడు. ‘రాధే శ్యామ్’ ‘ఆదిపురుష్’ వంటి సినిమాల టైంలో ‘రాజాసాబ్’ కనుక వచ్చి ఉంటే.. అభిమానులకి పెద్ద భారంగా ఫీలయ్యేవారు కాదేమో. కానీ ఇప్పుడు ‘సలార్’ ‘కల్కి 2898 ad’ వంటి సక్సెస్.. లతో ప్రభాస్ ఫామ్లో ఉన్నాడు. అభిమానులు కూడా ‘సలార్ 2’ ‘కల్కి 2’ కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నారు తప్ప ‘రాజాసాబ్’ అనే ఒక సినిమా ప్రభాస్ నుండి వస్తుందని పట్టించుకోవడం లేదు. సో ‘రాజా సాబ్’ పై బజ్ లేనట్టే అనుకోవాలి..! పైగా ఆ సినిమా వస్తుందని భయపడుతున్నారు.

- Advertisement -
Prabhas's Raja Saab Movie
Prabhas’s Raja Saab Movie

ఎందుకంటే.. ఆ సినిమా ఫలితం తేడా కొట్టినా ప్రభాస్ ఫ్యాన్స్ పెద్దగా ఫీలవ్వరు. కానీ ఎక్కడ ప్రభాస్ తో వెకిలి కామెడీ, చిల్లర కామెడీ చేయించి పాన్ ఇండియా లెవెల్లో విమర్శలపాలయ్యేలా చేస్తాడో అని ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ‘రాజా సాబ్’ లో ప్రభాస్ దెయ్యంగా కనిపించి కామెడీ చేస్తాడని అంటున్నారు. అది మారుతీ స్టైల్లో ఉంటే భరించడం కష్టమే..! మరోపక్క ‘రాజా సాబ్’ ని నిర్మిస్తున్న ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ వరుస ప్లాపులతో సతమతమవుతోంది. ఆ సంస్థ సోలోగా నిర్మించిన సినిమాలు అన్నీ ప్లాప్ అయ్యాయి. సో దర్శకుడు మారుతీపై ఇప్పుడు పెద్ద భారమే పడిందని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు