Director Puri: 7 సినిమాలకి గ్రీన్ సిగ్నల్.. ఆయన లేకపోతే డబుల్ ఇస్మార్ట్ లేదు.!

Director Puri.. టాలీవుడ్లో డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ గా పేరు పొందారు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. గత కొన్ని నెలలుగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న సమయంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.. ఆ వెంటనే లైగర్ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో హీరో విజయ్ దేవరకొండ తో తెరకెక్కించి రిలీజ్ చేయగా ఘోరమైన డిజాస్టర్ మూటగట్టుకుంది ఈ చిత్రం. దీంతో అప్పటినుంచి పూరీ జగన్నాథ్ ఎక్కువగా వివాదాలలో వినిపిస్తూ ఉన్నారు. దీంతో మళ్లీ హీరో రామ్ తో కలిసి డబుల్ ఇస్మార్ట్ సినిమాని తెరకెక్కించారు.

Director Puri: Green signal for 7 movies.. Without him there is no double smart.!
Director Puri: Green signal for 7 movies.. Without him there is no double smart.!

డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న విడుదల..

డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయబోతున్నారు. ఇందులో రామ్ పోతినేని కి జోడిగా కావ్య థాపర్ హీరోయిన్ గా నటించిగా, మరో కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించారు. ఇటీవలే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలో ఒక ఈవెంట్ ని సైతం నిర్వహించారు. అక్కడికి హీరో రామ్, డైరెక్టర్ పూరీ, నిర్మాత చార్మీ , హీరోయిన్ కావ్య థాపర్ రావడం జరిగింది. దీంతో అక్కడ వీరు పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

డబుల్ ఎనర్జీ, డబుల్ మాస్ ఎంటర్టైన్మెంట్..

మొదట హీరో రామ్ మాట్లాడుతూ.. నార్త్ ఆడియన్స్ కూడా సౌత్ సినిమాలను చాలా ఇష్టంగానే చూస్తున్నారు. నేరుగా హిందీలో నార్త్ సినిమాలను విడుదల చేయాలని కోరుకుంటున్నారు. డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా నార్త్ ఆడియన్స్ ని మెప్పించడానికి సిద్ధంగా ఉండడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా ఎక్కువ భాగం ముంబై పరిసర ప్రాంతాలలోనే షూట్ చేశామని కూడా తెలిపారు. ఈ సినిమా కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నానని తెలిపారు హీరో రామ్ పోతినేని .. ఇందులో తన క్యారెక్టర్ కూడా ఆడియన్స్ ని ఎంజాయ్ చేసేలా ఉంటుందని , అలాగే డైరెక్టర్ పూరి తనకోసం క్యారెక్టర్ ఇలాంటిది డిజైన్ చేయడం కూడా మరింత ఆనందంగా ఉందని తెలిపారు హీరో రామ్. డబుల్ ఎనర్జీ, డబుల్ మాస్ ఎంటర్టైన్మెంట్ తో వస్తున్నామని రామ్ తెలిపారు.

- Advertisement -

సంజయ్ దత్ పాత్ర హైలెట్..

డబుల్ ఇస్మార్ట్ లో సంజయ్ దత్ పాత్ర హైలెట్ గా ఉంటుందని అతడు తప్పితే మరొకరు ఈ సినిమాలో నటించలేరు అనేంతగా నటించారని , ఆయన ఒక హార్డ్ వర్కర్ అంటూ తెలిపారు. పూరి కూడా చాలా కూల్ గానే ఈ సినిమాని తెరకెక్కించారని తెలిపారు. ఆ తర్వాత డైరెక్టర్ పూరి మాట్లాడుతూ.. నేను సంజయ్ బాబాకి పెద్ద అభిమానిని. ఆయనకు కూడా నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. ఎలాంటి పాత్రలోనైనా నటించగలరు .తాము కలిసినప్పుడు సంజయ్ దత్ బాబా ఏడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. అయితే డేట్స్ లేవని చాలా ఫీల్ అయ్యాము. చివరికి ఆయనే డేట్స్ దొరికాయని చెప్పారు. అప్పుడు చాలా ఆనందపడ్డామంటూ తెలిపారు.

7 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా మా సినిమా కోసం వచ్చారు..

డబుల్ ఇస్మార్ట్ సినిమాలో నటించినందుకు ఆయనకు థాంక్యూ అంటూ డైరెక్టర్ పూరి తెలియజేశారు. ముఖ్యంగా ఈ చిత్రాన్ని ముంబైలో ప్రమోట్ చేయడం చాలా ఆనందంగా ఉందని కూడా తెలియజేశారు. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మీ అందరి ప్రేమ వల్లే హిట్ అయ్యింది. సీక్వెల్ ని కూడా ఏకంగా ఐదు భాషలలో విడుదల చేస్తున్నామంటూ తెలిపారు. ఇక నిర్మాత ఛార్మి కూడా ఈ సినిమా సక్సెస్ అవుతుందని ఆశా భావం వ్యక్తం చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు