Director Puri Jagannath : ఇది పూరీ ట్రెండ్ గురూ… హీరోయిన్లను ఆ యాంగిల్ లో చూపించకపోతే ఈ డైరెక్టర్ కు నిద్ర పట్టదా?

Director Puri Jagannath : డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ హీరోల ఇమేజ్ ని మార్చే సత్తా ఉన్న డైరెక్టర్ పూరీ. అయితే తాజాగా ఈ డైరెక్టర్ క్రియేట్ చేస్తున్న కొత్త ట్రెండ్ చూస్తుంటే హీరోయిన్లను ఆ యాంగిల్ లో చూపించకపోతే ఈ డైరెక్టర్ కు నిద్ర పట్టదా? అన్పిస్తోంది. అంతేకాదు పూరీ ఫాలో అవుతున్న స్టైల్ ను అందరు డైరెక్టర్స్ ఫాలో అయితే ఇక ఇండస్ట్రిలో ఐటం గర్ల్స్ కు కాలం చెల్లినట్టే.

హీరోయిన్లను వాడేస్తున్న పూరీ

బోల్డ్, వినోదాత్మక చిత్రాలకు పేరు గాంచిన డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన సినిమాల్లో ఐటెం సాంగ్స్‌ను చేర్చడంలో మాస్టర్ అని చెప్పవచ్చు. పోకిరి, బిజినెస్ మాన్, టెంపర్ వంటి సినిమాలే అందుకు ఉదాహరణ. గతంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు చేసి ముమైత్ ఖాన్, శ్వేతా భరద్వాజ్, నోరా ఫతేహి వంటి హీరోయిన్లు ఐటెమ్ గర్ల్స్ గా బాగా పాపులర్ ఆయారు. ఇటీవల కాలంలో “ఇస్మార్ట్ శంకర్”, “లైగర్” వంటి చిత్రాలలో దర్శకుడు భిన్నమైన విధానాన్ని తీసుకున్నాడు.

ఐటెం గర్ల్స్‌పై ఆధారపడకుండా దర్శకుడు పూరీ తన సినిమాలలో నటించే కథానాయికలను వాడుకుంటున్నాడు. ఐటం గర్ల్స్ ను పూర్తిగా పక్కన పెట్టసి, హీరోయిన్లనే మరింత ఆకర్షణీయంగా, స్పైసీగా చూపిస్తున్నాడు. అందుకే తన సినిమాల్లో హీరోయిన్లనే సినిమాలో కథానాయికగా కొనసాగించడంతో పాటు ఐటం సాంగ్స్ కు కూడా వాడేస్తూ కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తున్నాడు.

- Advertisement -

Double iSmart: Maar Muntha Chod Chinta promises mass vibes - Telugu News -  IndiaGlitz.com

డబుల్ ఇస్మార్ట్ లో కూడా ఇదే ట్రెండ్

రామ్, పూరీ జగన్నాధ్‌ల డబుల్ ఇస్మార్ట్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మార్ ముంత చోడ్ చింతా రెండవ సింగిల్ ఎట్టకేలకు విడుదలై, నిమిషాల్లోనే వైరల్ అయ్యింది. ఇటీవల విడుదలైన ప్రోమో సాంగ్ పై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేయగా, తాజాగా రిలీజైన ఈ పాట అచ్చమైన తెలంగాణా ఫ్లేవర్‌లో ఎనర్జిటిక్ బీట్స్, క్యాచీ లిరిక్స్‌తో అల్ట్రా మాస్ డ్యాన్స్ నంబర్ గా ఈ పాట అదరగొడుతోంది. ‘మార్ ముంత చోడ్ చింత’ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఈ పాటలోని హైదరాబాదీ స్లాంగ్, రసవంతమైన సాహిత్యం ఖచ్చితంగా యూత్ ను ఆకర్షిస్తుంది. ఈ సాంగ్ ను రాహుల్ సిప్లిగంజ్, ధనుంజన్ సీపాన, కీర్తనా శర్మ త్రయం పాడారు. మణిశర్మ తన లోకల్ బీట్‌లతో ఈ పాటను అందించిన మ్యూజిక్ బాగుంది. అయితే సినిమాలో కూడా అదే ట్రెండ్ ను ఫాలో అయ్యాడు పూరీ, ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న కావ్య థాపర్ తో మార్ ముంత చోడ్ చింతా పాటకు అదిరిపోయే స్టెప్పులు వేయించారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ బన్ని జ కూడా ఈ సినిమాలో మరింత గ్లామరస్ గా కన్పించబోతోంది అని టాక్ నడుస్తోంది. తెలుగు సినిమా “తిక్క”, పాపులర్ వెబ్ సిరీస్ “ఫోర్ మోర్ షాట్స్”తో పాపులర్ అయిన బన్ని జె, పూరి జగన్ డబుల్ ఇస్మార్ట్‌కి కొత్త కోణాన్ని జోడించారు. రామ్ పోతినేని కథానాయకుడిగా నటించిన డబుల్ ఇస్మార్ట్ ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు