Director Teja About Ramoji Rao: తెలుగు జాతిలో పుట్టిన సూర్యుడు

Director Teja About Ramoji Rao: ఈనాడు సంస్థల అధినేత ప్రముఖ నిర్మాత రామోజీరావు నేడు తెల్లవారుజామున మరణించిన విషయం తెలిసిందే. చాలామంది సినిమా ప్రముఖులు ఈ విషయంపై నివాళులర్పిస్తూ వస్తున్నారు. ఇప్పటికే చాలామంది సినిమా ప్రముఖులు తమ సంఘీభావాన్ని తెలిపారు. కేవలం సినిమా వాళ్ళు మాత్రమే కాకుండా ఎంతో మంది రాజకీయ నాయకులు కూడా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం రామోజీరావు పార్థివ దేహాన్ని చూడడానికి పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Teja
రామోజీరావు గారు ఎంతోమంది ప్రముఖులను దర్శకులను నటులను హీరోలను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే. అయితే కొంతమంది దర్శకులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తమదైన ముద్రను వేసుకున్నారు. రామోజీరావు పరిచయం చేసిన దర్శకులలో తేజ ఒకరు. తేజ చేసిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించాయి. తేజ దర్శకుడుగా పరిచయమైన సినిమా చిత్రం. ఈ సినిమాకు రామోజీరావు నిర్మాతగా వ్యవహరించారు. నేడు రామోజీరావు మరణించిన కారణంగా తేజ ఎమోషనల్ అయ్యారు.

తేజ మాట్లాడుతూ..

రామోజీరావు కీలక జరగటం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక భయంకరమైన లాస్. తెలుగు జాతిలో పుట్టిన సూర్యుడు ఎవరంటే రామోజీరావు. పత్రికల్లో గాని సినిమా రంగంలో గానీ వ్యాపారంలో గాని దేనిలో అయినా ఒక స్టాండర్డ్ ని మైంటైన్ చేసేవాళ్లు. నేను డైరెక్ట్ రావడానికి కారణం రామోజీరావు గారు. ఫస్ట్ సినిమా చిత్రం ఆయనే ప్రొడ్యూసర్. ఈ సినిమా కథను ఆయన 20 నిమిషాల్లో ఓకే చేశారు. రామోజీరావు గారికి ఒక సిస్టం ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది. ఏం చేసినా కూడా ఒక పద్ధతి ప్రకారం వెళ్తారు. రామోజీరావు గారు మరణించడం అనేది రాజకీయంగా లాస్, స్టేట్ కి లాస్, జర్నలిస్టులకు లాస్, సినిమాలకు లాస్, తెలుగు భాష కి లాస్, ఈ లాస్ ని మనం పూడ్చలేము నా జీవితంలో చూసిన అతి గొప్ప మనుషుల్లో రామోజీరావు ఒకరు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు