Jr NTR : ఎన్టీఆర్ పేరుపై చర్చ.. పెట్టింది రామారావు కాదా? కన్ఫ్యూజన్ లో పడేసిన వైవిఎస్ చౌదరి రిప్లై

Jr NTR : టాలీవుడ్ లో నందమూరి కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతుల గురించి తెలిసిందే. నటసార్వభౌమ ఎన్టీ రామారావు మూడు దశాబ్దాల పాటు తెలుగు వెండితెరకి ఏలగా, ఆయన వారసత్వాన్ని లెగసీని నిలబెడుతూ బాలకృష్ణ కంటిన్యూ చేసారు. ఇక ఈ మూడో తరంలో జూనియర్ ఎన్టీఆర్ తాత వారసత్వాన్ని నిలబెడుతూ నందమూరి నటవారసుడిగా టాలీవుడ్ లో అగ్ర హీరోలలో ఒకడిగా కొనసాగుతున్నాడు. చాలా మంది నందమూరి అభిమానులు రామారావుకి అసలు సిసలు వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అనే అంటారు. అంతే కాదు ఎన్టీఆర్ కి ఇష్టమైన మనవడు కూడా తారక్ అనే అంటూ ఉంటారు. కానీ తాజాగా దర్శకుడు వైవిఎస్ చౌదరి ఓ ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్ పేరుపై చర్చ జరిగేలా చేస్తుంది.

Director YVS Chaudhary's interesting comments on Jr NTR's name

ఎన్టీఆర్ కి ఇష్టమైన మనవడు తారక్ కాదా?

అసలు విషయానికి వస్తే… ఒకప్పటి స్టార్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి ఎన్టీఆర్ వీరాభిమాని అయిన వైవిఎస్ చౌదరి చాలా రోజుల తర్వాత మళ్ళీ కొత్త ఆర్టిస్టులని పరిచయం చేస్తూ, ఎన్టీఆర్ (న్యూ టాలెంట్ రోర్స్) అనే బ్యానర్ మీద ఓ కొత్త సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ ప్రెస్ మీట్ నిర్వచించాడు. ఆ ప్రెస్ మీట్ లో వైవిఎస్ చౌదరికి ఓ ప్రశ్న ఎదురైంది. నందమూరి తారక రామారావు గారికి జూనియర్ ఎన్టీఆరే ఇష్టమైన మనవడు కదా? అంటూ… మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. దానికి వైవిఎస్ చౌదరి రియాక్షన్ ఊహించని విధంగా వచ్చింది. ఆయన మాట్లాడుతూ… ‘రామారావు గారికి ఎన్టీఆర్ ఇష్టమైన మనవడు అని ఎవరూ?.. ఇష్టమైన మనవడు అని ఎవ్వరూ ఎక్కడా చెప్పలేదే… ఎన్టీఆర్ కూడా ఎక్కడా చెప్పుకోలేదే.. అలాగే రామారావు గారు కూడా చెప్పుకోలేదే.. ఆయనకు అందరూ సమానమే.. అని వైవీఎస్ చౌదరి చెప్పుకొచ్చాడు.

- Advertisement -

ఎన్టీఆర్ కి పేరు పెట్టింది రామారావు కాదు?

అయితే దీనికి ప్రతిగా… ఎన్టీఆర్ అంటేనే ఇష్టం కాబట్టి.. తన పేరుని ఆయనకు పెట్టారు కదా? అని మరో మీడియా ప్రతినిధి అడిగాడు. అయితే దానికి వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ… ఎన్టీఆర్‌కు ఆ పేరుని హరికృష్ణ గారు పెట్టారని వైవీఎస్ చెప్పుకొచ్చారు. ఆయన కొడుకులకు ‘జానకీ రామ్, కళ్యాణ్ రామ్, తారక్ రామ్’ అని హరికృష్ణ పెట్టాడని… ఎన్టీఆర్ గారు పెట్టలేదని చెప్పుకొచ్చాడు. ఇక్కడ నందమూరి అభిమానులు సంధిగ్ధంలో పడ్డారు. ఎందుకంటే… స్వయంగా హరికృష్ణ గతంలో ఓ స్టేజ్ మీద మాట్లాడుతూ.. స్వయానా నందమూరి తారకరామారావు తన పేరుని తన మనవడికి ఇచ్చాడని, తనకి నువ్వు నా అంశ… నీకు నా పేరు ఉండాలని.. తారక రామారావు అని పేరు పెట్టారని హరికృష్ణ గుర్తుచేసారు. దీంతో అసలు ఎన్టీఆర్ కి ఆ పేరు పెట్టింది ఎవరా అన్న చర్చ నడుస్తుంది. ఇక దర్శకుడు హరికృష్ణ మనవడ్ని త్వరలో లాంచ్ చేయబోతున్నాడని సమాచారం.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు