Directors turned producers : నిర్మాతలుగా మారిన తెలుగు డైరెక్టర్లు వీళ్లే..!

Directors turned producers.. ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి, ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చాలామంది దర్శకులు తమ సినిమాలకు పారితోషకం కాకుండా లాభాలలో వాటా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బాగా ఆర్జిస్తున్నారు కూడా.. ఇక అందులో భాగంగానే చాలామంది డైరెక్టర్లు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును తాము తీసే చిత్రాలకు నిర్మాతలుగా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మరి తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాతలుగా మారిన తెలుగు డైరెక్టర్లు ఎవరో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

Directors turned producers: These are the Telugu directors who became producers..!
Directors turned producers: These are the Telugu directors who became producers..!

ఎస్.ఎస్. రాజమౌళి..

దిగ్గజ దర్శక ధీరుడు రాజమౌళి ఒకప్పుడు శాంతి నివాసం అనే ఎపిసోడ్ సీరియల్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టి , ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ నేడు గ్లోబల్ స్థాయిలో డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్నారు. ఒకవైపు డైరెక్టర్ గా సినిమాలు తెరకెక్కిస్తూనే.. మరొకవైపు విజయేంద్ర ప్రసాద్ ప్రొడక్షన్ హౌస్ ను నిర్మించి పలు చిత్రాలను నిర్మిస్తున్నారు.

- Advertisement -

త్రివిక్రమ్ శ్రీనివాస్:

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకవైపు రచయితగా కెరియర్ మొదలుపెట్టి, ఆ తర్వాత డైరెక్టర్గా మారి పలు చిత్రాలు తెరకెక్కించి , మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఈయన కూడా ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ అనే నిర్మాణ సంస్థను నిర్వహిస్తున్నాడు ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థ బాధ్యతలు ఈయన భార్య సాయి సౌజన్య చేపట్టారు.

పూరి జగన్నాథ్:

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఒకవైపు సినిమాలు చేస్తూ మరొకవైపు పూరీ కనెక్ట్స్ అనే నిర్మాణ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ బ్యానర్ తో చార్మీ కూడా చేతులు కలిపిన విషయం తెలిసిందే.

దాసరి నారాయణరావు:

దివంగత దర్శకులు, నటులు అయిన దాసరి నారాయణరావు తారక ప్రభు ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థను నిర్వహించేవారు.

ఈ.వీ.వీ సత్యనారాయణ:
కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈయన ఈవివీ సినిమాస్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు.

సురేష్ బాబు:

సురేష్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను ఈయన కొనసాగిస్తున్నారు.

కృష్ణవంశీ:.

ప్రముఖ డైరెక్టర్ కృష్ణవంశీ కూడా తన పేరు మీదనే కృష్ణవంశీ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థను నిర్వహిస్తున్నారు.

గుణశేఖర్:

రుద్రమదేవి వంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించిన గుణశేఖర్ గుణ టీం వర్క్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన విషయం తెలిసిందే.

శేఖర్ కమ్ముల:

ఎప్పుడు కూడా యువతను ఆకట్టుకునే విధంగా ఫ్రెష్ ఫీల్ అయ్యేలా సినిమాలను తెరకేక్కించే శేఖర్ కమ్ముల అమీగోస్ క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు.

దేవా కట్ట:

ప్రముఖ డైరెక్టర్ దేవా కట్టా కూడా దేవా కట్ట ప్రొడక్షన్ హౌస్ నిర్మించారు.

ప్రశాంత్ వర్మ:

హనుమాన్ చిత్రంతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రశాంత్ వర్మ ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు