Prabhas : హిట్ ఇవ్వడమే కాదు బోనస్‌గా పరువు మొత్తం తీస్తున్నారు… పాపం డార్లింగ్

Prabhas : పరువు… దీని కోసం హత్యలు కూడా జరుగుతాయి. ఇప్పుడు హత్యల వరకు ఎందుకు గానీ, పాన్ ఇండియా స్టార్ ఎదిగిన ప్రభాస్ కు ఈ పరువు అనేది పెద్ద తల నొప్పిగా మారింది. సాధారణంగా ఒక వ్యక్తి పరువును గిట్టని వాళ్లు తీస్తారు. కోపం, పగ పెంచుకున్న వాళ్లు తీస్తారు. కానీ, మన డార్లింగ్ విషయంలో మాత్రం ఆయన ఎక్కువ నమ్మిన వాళ్లు, దగ్గరుండి హిట్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్లే అడ్డంగా బుక్ అయ్యేలా… ప్రభాస్ ను ట్రోల్ కంటెంట్ చేసేలా చేస్తున్నారు. ఇది వినడానికి ప్రభాస్ ఫ్యాన్స్ కు కాస్త ఇబ్బందిగా ఉన్నా.. నిజం అండి బాబు. ఎలా అనుకుంటున్నారా… ఇది చదవండి తెలుస్తుంది..

రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ ఎదిగాడు.. బాహుబలి సినిమాలు అతని లైఫ్ కు టర్నింగ్ పాయింట్ అయ్యాయి.. ఆ సినిమాల తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. కొన్ని సినిమాలు విడుదలకు ముందు భారీ హైప్ ను క్రియేట్ చేసుకొని రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. ప్రభాస్ కంటెంట్ విషయంలో తప్పుడు స్టెప్ వేసాడని విమర్శకులు కూడా తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే..

Directors who are defaming Prabhas by revealing his secret
Directors who are defaming Prabhas by revealing his secret

ఇదిలా ఉండగా.. ప్రభాస్ తో సినిమాలు తీస్తున్న దర్శకులు అతని పరువును అడ్డంగా తీస్తున్నారని ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందుకు కారణం కూడా లేకపోలేదు.. డార్లింగ్ ఇప్పటి వరకు నటించిన సినిమా డైరెక్టర్స్ అతనికి హిట్ ను అందించిన నెగిటివ్ టాక్ ను అందించారు.. ప్రభాస్ కు బద్ధకం ఎక్కువ. అందుకే సినిమాలు ఆలస్యం అవుతున్నాయని బాంబ్ పేల్చారు.. గతంలో రాజమౌళి, నాగ్ అశ్విన్ వంటి ప్రముఖ దర్శకులు మీడియా ముందే ఈ మాటలు అన్న సందర్భాలు లేకపోలేదు..

- Advertisement -

అదే ఇప్పుడు వార్తల్లో హైలెట్ అవుతుంది.. సినిమాల పరంగా హిట్ ను అందించిన వెనక ఇలాంటి మాటలు అనడం పై డార్లింగ్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. బద్ధకం అంటారు కానీ అలా పెద్ద యాక్షన్ సీన్స్ చెయ్యడం ఎంతకష్టం…ఇలా అనడం ఇబ్బందిగా ఉందని భాధపడుతున్నారు.. ఇక డార్లింగ్ సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. ప్రభాస్ ఏకంగా నాలుగు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు.. రాజా సాబ్ సినిమాతో త్వరగా ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్నాడు.. ఆ తర్వాత సలార్ 2 షూటింగ్ ను పూర్తి చెయ్యనున్నట్లు సమాచారం..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు