Raj Tarun : హీరో రాజ్ తరుణ్ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తుంది.. రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసు వల్ల రోజుకో నిజం బయటకు వస్తుంది.. రాజ్ తరుణ్ లావణ్య ను దారుణంగా మోసం చేశాడని ఆమె పెట్టిన కేసు వల్ల రాజ్ తరుణ్ చుట్టు వివాదాలు చుట్టుకున్నాయి.. అయితే రాజ్ తరుణ్ పై ఇవే కాదు ఎన్నో కేసులు ఉన్నట్లు తెలుస్తుంది.. గతంలో చాలా కేసులు ఉన్నాయి.. ఒక్కో కేసు వెలుగులోకి వస్తుండటంతో రాజ్ తరుణ్ పై ట్రోల్స్ పెరుగుతున్నాయి.. అతని పై ఉన్న కేసుల గురించి ఒక్కొక్కటి బయట వస్తున్నాయి..
లావణ్య కు రోజు రోజుకు అనుకూలంగా కేసు మారుతుంది.. తనను డ్రగ్స్ కేసులో కూడా ఇరికించాడని, తాను 43 రోజుల పాటు జైలులో ఉండాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. అయితే దీనికి సంబంధించిన ఆధారాలు ఇవ్వాలంటూ లావణ్యను పోలీసులు కోరారు. ఆమె తన వద్ద ఉన్న ఆధారాలను ఇచ్చింది.. అవన్నీ నిజమే అని నమ్మడంతో రాజ్ తరుణ్ కు పోలీసులు నోటీసులు పంపారు.. అయితే, ఈ నెల 18లోగా విచారణకు రావాలని తాజాగా రాజ్ తరుణ్ కు నార్సింగి పోలీసులు నోటీసులు పంపారు. బీఎన్ఎస్ఎస్ 45 కింద రాజ్ తరుణ్‌కు నోటీసులు జారీ చేశారు..
అలాగే రాజ్ తరుణ్ సినిమాలో హీరోయిన్ గా నటించిన మాల్వి మల్హోత్రా తో కూడా ఎఫైర్ ఉందని లావణ్య ఆరోపించింది.. అలాగే ఈరోజు మాల్వి నిజ స్వరూపం ఇదే అని ఓ నిర్మాత తల్లి వీడియో రిలీజ్ చేసింది ఇవన్నీ కూడా కేసును కీలకం చేశాయి.. అయితే రాజ్ తరుణ్ మీద గతంలో చాలా కేసులు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు, యాక్సిడెంట్ కేసులు కూడా ఉన్నాయని తెలుస్తుంది.. ఇవన్నీ చూసుకుంటే రాజ్ తరుణ్ చుట్టు ఉచ్చు బిగుసుకుంది.. ఇక అతను జైలుకు వెళ్లడం ఖాయమని కొందరు చెబుతున్నారు.. మరి ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి..