Sandeep Reddy: స్పిరిట్ సినిమాలో ప్రభాస్ లుక్స్ ను ఎలా డిజైన్ చేస్తున్నాడో తెలుసా.?

Sandeep Reddy: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న సంచలమైన దర్శకులలో సందీప్ రెడ్డి వంగ ఒకరు. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. బాక్సాఫీస్ వద్ద అర్జున్ రెడ్డి సినిమా అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. అప్పట్లో శివ సినిమా ఎంతటి సంచలనం చూపించిందో అదే మాదిరిగా ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయింది. కొన్ని సంవత్సరాలు పాటు ఈ సినిమా గురించి చాలామంది మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ సినిమా ఇచ్చిన ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా అనిపించింది చాలా మందికి. మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్ అయిపోయాడు సందీప్ రెడ్డి వంగ.

Sandeep Reddy

అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో కబీర్ సింగ్ అనే పేరుతో తెరకెక్కించాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాకి రివ్యూస్ అండ్ రేటింగ్స్ మాత్రం చాలా తక్కువగా వచ్చాయి. ఈ సినిమాని ఒక వైలెంట్ ఫిలిం అంటూ చాలామంది సినిమా క్రిటిక్స్ రాసుకొచ్చారు. అందరికీ సమాధానంగా అసలు వైలెంట్ ఫిల్మ్ అంటే ఏంటో నేను చూపిస్తాను అంటూ సందీప్ రెడ్డి వంగ శపథం చేశాడు.

- Advertisement -

ఇకపోతే రీసెంట్ గా అనిమల్ అనే సినిమాను తెరకెక్కించాడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించి సంచలనానికి తెరతీసింది. ఈ సినిమా గురించి కూడా చాలామంది కామెంట్స్ చేశారు. కానీ ఆ కామెంట్స్ అన్నిటికీ ఈ సినిమా కలెక్షన్స్ సమాధానం చెప్పాయి. ఇకపోతే ప్రస్తుతం స్పిరిట్ అనే సినిమాను చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ ను చాలా డిఫరెంట్ గా డిజైన్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఈ సినిమాకి సంబంధించి ప్రభాస్ రెండు లుక్స్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఒక లుక్ లో కంప్లీట్ రఫ్ గా కనిపించనున్నాడట ప్రభాస్. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ఈ ఇయర్ చివర్ లో మొదలుకానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు