Prakash Raj : ప్రకాష్ రాజ్ అసలు పేరేంటో తెలుసా..? అస్సలు ఊహించి ఉండరు..

Prakash Raj : తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు నటుడు ప్రకాష్ రాజ్.. విలక్షణ నటుడుగా ఎన్నో పాత్రల్లో నటించి నటుడుగా అందరి మనసును దోచుకున్నాడు.. హీరోగా, ఫ్రెండ్ గా, అన్నగా, తండ్రిగా, తాతగా ఇలా ఏ పాత్రలోనైన నటిస్తాడు. గత ముప్పై ఏళ్లుగా విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఈయన ఏడు ప్రధాన భాషల్లో నాలుగు వందల సినిమాలకు పైగా నటించారు. అన్ని సినిమాలు తనకు ఒక మార్క్ ను తీసుకొచ్చాయి. నటుడిగానే కాకుండా టీవీ హోస్ట్ గా, నిర్మాతగా, దర్శకుడిగానూ ప్రత్యేక మార్క్ ను అందుకున్నారు. ఈయన గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వినిపిస్తుంది.

ప్రకాష్ రాజ్ అసలు పేరేంటో తెలుసా?

సినిమాల పరంగా ఈయన పేరు ప్రకాష్ రాజ్ అని అందరికీ తెలుసు.. నిజానికి ఆయన పేరు వేరే ఉందట. ప్రకాష్ రాజ్ అసలు పేరు ప్రకాష్ రాయ్.. ప్రకాష్ రాజు తమ్ముడు పేరు ప్రసాద్ రాయ్.. ఈయన కూడా నటుడే.. ఆయన తల్లి క్రిష్టియన్, ఆమె హుబ్లీ లోని ఒక అనాథ శరణాలయంలో పెరిగిన అమ్మాయి. వాళ్ల పేరెంట్స్ ది లవ్ మ్యారేజ్. ఇతను ఇతని తమ్ముడు మాత్రమే ఉన్నారు. పేరు మార్చుకున్న తర్వాత నాటకాలు అంటే ఇష్టంలో ఇలా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడంతో అక్కడకు ఎంట్రీ ఇచ్చాడు.. కేరీర్ మొదట్లో కొన్ని కన్నడ చిత్రాల్లో నటించిన ప్రకాశ్ రాజ్.. 1994లో కె. బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డ్యూయెట్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. ఆ తర్వాత డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.. సంకల్పం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు.. ఆ తర్వాత ఆయన తెలుగులో వరుస సినిమాలను చేస్తూ వస్తున్నాడు.. అతను చేసిన పాత్రలకు అవార్డులను కూడా అందుకున్నాడు..

- Advertisement -
Do you know the real name of Prakash Raj..?
Do you know the real name of Prakash Raj..?

ప్రకాష్ రాజ్ వివాదాలు..

ఈయనకు నటుడిగా ఎంతమంచి పేరు వచ్చిందో అన్నీ వివాదాలు కూడా ఆయన్ని వెంటాడాయి కూడా. పలుమార్లు మా అసోసియేషన్ ఆయన్ని బ్యాన్ చేసింది కూడా.. అయితే అతని రోల్ లో ఎవరు రీప్లేస్ చేయకపోవడంతో మళ్లీ బ్యాన్ ని ఎత్తివేశారు. బ్యాన్ చేసినప్పుడు కుంగిపోలేదు.. ఎత్తివేసినప్పుడు సంతోషించలేదు. నిజంగా ఈయన లాగా ఉండటం కష్టమే.. సాయం కోరి వచ్చిన వారికి లేదనకుండా సాయం చేస్తాడు. ఆ తర్వాత అంతకు మించి అనేలా సినిమాలను లైన్లో పెడుతూ బిజీగా ఉన్నాడు. ఈయన తమ్ముడు కూడా మంచి నటుడే. ఇక పర్సనల లైఫ్ విషయానికొస్తే.. మొదటి భార్య తో విడాకులు తీసుకున్న తర్వాత బాలీవుడ్ డ్యాన్సర్ ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మూడో పెళ్లి కూడా చేసుకున్నాడని తెలుస్తుంది. ఈయన సినిమాల గురించి అందరికి తెలుసు . ఈ మధ్య తాత పాత్రల్లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం తెలుగులో నాలుగు సినిమాలు లైన్లో ఉన్నట్లు టాక్..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు