Dhanush : రాయన్ మూవీ హీరో ధనుష్ అసలు పేరు ఏంటో తెలుసా..? ఎందుకు ఛేంజ్ చేసుకున్నాడంటే..?

Dhanush : కోలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోలు అంటే.. విజయ్ దళపతి, అజిత్, రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య.. అంటూ చెపుకుంటూ వెళ్తారు. కానీ, క్రేజ్ ఎక్కువ ఉన్న హీరో, ఆయన నుంచి వచ్చే సినిమాలపై సాధారణంగానే ఓ హైప్ ఉండే హీరో ఎవరంటే… ధనుష్ మాత్రమే. ఈ రోజు ఆయన హీరోగా వస్తున్న రాయన్ మూవీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ రివ్యూ గానీ, ట్విటర్ రివ్యూలు గానీ ప్రస్తుతానికి పాజిటివ్ గానే వస్తున్నాయి. త్వరలోనే ఫుల్ రివ్యూ రానుంది. అయితే ఈ నేపథ్యంలో ధనుష్ అసలు పేరు ఏంటో తెలుసుకుందాం…

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. ఇది అందిరికీ తెలిసిన పేరు. కానీ, ఆయన అసలు పేరు ఇది కాదు. నిజానికి ఆయన అసలు పేరుకు ధనుష్ అనే పేరుకు ఎలాంటి సంబంధం కూడా లేదు. అయితే ఓ సినిమా చూసిన తర్వాత, అందులో ఓ పదం నచ్చి తన పేరును మార్చుకున్నారట.

అసలు పేరు ఇదే..?

ధనుష్.. కోలీవుడ్ నిర్మాత కస్తూరి రాజా కుమారుడు అని అందరికీ తెలిసిందే. అప్పుడు వాళ్ల తల్లిదండ్రులు పెట్టిన పేరు “వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా” ప్రొడ్యూసర్ ఇంట్లో పుట్టడంతో సినిమాలపై ఇంట్రెస్ట్ వచ్చేసింది. అ టైంలో రెగ్యూలర్ గా సినిమాలు చూసే అలవాటు ఉన్న వెంకటేష్‌కు… అప్పుడు 1995లో రిలీజ్ అయిన కమల్ హాసన్ మూవీ కురుతిపునల్ బాగా నచ్చింది. అందులో అపరేషన్ ధనుష్ అనే వర్డ్ బాగా నచ్చడంతో తన పేరును ధనుష్ గా మార్చుకున్నాడు వేంకటేష్. అప్పటి నుంచి వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా కాస్త ధనుష్ అయ్యాడు.

- Advertisement -

తర్వాత ధనుష్ తన సోదరుడు సెల్వా రాఘవన్ వల్ల కోలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. తన ఫస్ట్ మూవీ తుళ్లువదో ఇలామై 2002 లో రిలీజ్ అయింది. దీనికి డైరెక్టర్ గా ధనుష్ తండ్రి కస్తూరి రాజా చేశాడు. అలాగే స్క్రిన్ ప్లేను సెల్వా రాఘవన్ ఇచ్చాడు. అప్పటి నుంచి కెరీర్ స్టార్ట్ చేసిన ధనుష్ ఎన్నో ఒడిదుకులు ఎదుర్కొని ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో టార్ 1 హీరోగా ఎదిగాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు