NTR- Ram Pothineni : హీరో రామ్ కు ఎన్టీఆర్ కు మధ్య సంబంధం ఏంటో తెలుసా?

NTR- Ram Pothineni : నందమూరి నట వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు వినగానే ఫ్యాన్స్ కు పూనకాలు వస్తాయి.. మాస్, యాక్షన్, లవ్ ఎంటర్టైనర్ సినిమాలలో నటిస్తూ అభిమానులను మనసును దోచుకున్నాడు.. గతంలో వచ్చిన సినిమాలు నటుడుగా గుర్తింపు తీసుకొచ్చాయి.. త్రిపుల్ ఆర్ సినిమా మాత్రం ప్రపంచవ్యాప్తంగా స్టార్ ఇమేజ్ ను అందించింది.. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపును తెచ్చుకున్నాడు.. తారక్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు.. ఎన్టీఆర్ తో సినిమాలు చేసేందుకు డైరెక్టర్స్ తో పాటుగా హీరోయిన్ లు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. కాగా ఎన్టీఆర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తుంది.. ఎన్టీఆర్, ఓ స్టార్ హీరోకు మధ్య ఉన్న సంబంధం ఇదే అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతుంది..

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉంది. రీసెంట్ గా ఈ సినిమా లోని రొమాంటిక్ సాంగ్ షూటింగ్ ను పూర్తి చేశారు.. సెప్టెంబర్ లో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.. దాంతో పాటుగా బాలీవుడ్ బడా సినిమా వార్ 2 లో కూడా నటిస్తున్నాడు తారక్. ఈ మూవీలో హృతిక్ రోషన్ తో పాటు కలిసి నటించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది..

relationship between Hero Ram and NTR?
Do you know the relationship between Hero Ram and NTR?

ఇదిలా తాజాగా ఎన్టీఆర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో షికారు చేస్తుంది.. హీరో ఎన్టీఆర్ కు, ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని బ్రదర్ అవుతాడని ఓ వార్త వినిపిస్తుంది.. ఇది నమ్మడం కష్టమే అయినా.. ఇది నిజం అని తెలుస్తుంది.. ఈ ఇద్దరు హీరోలు బంధువులట.. ఈ విషయాన్ని హీరో రామ్ ఓ సందర్బంలో చెప్పాడు.. గతంలో ఓ వేదికపై రామ్‌ పోతినేని మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నాకు వరసకు అన్నయ్య అవుతాడు అని తెలిపాడు.. అప్పట్లో ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యింది.. ప్రస్తుతం ఈ వార్త విన్న ఇద్దరి ఫ్యాన్స్ నెట్టింట చర్చలు జరుపుతున్నారు.. రామ్ విషయానీకొస్తే.. ఇస్మార్ట్ శంకర్ 2 సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు