Trivikram: మహారాజా సినిమాలో పోలీస్ ఆఫీసర్ కి త్రివిక్రమ్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా.?

Trivikram: స్వయంవరం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి రచయితగా పరిచయం అయ్యాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆ సినిమాకు రాయడానికి ముందు తన స్నేహితుడు సునీల్ ప్రతి ఆఫీస్ కి వెళ్లి నా రూమ్ లో మంచి రైటర్ ఉన్నాడు. నా రూమ్ లో మంచి రైటర్ ఉన్నాడు అంటే ఎవరు పట్టించుకునేవారు కాదు. కానీ ఒక్కసారి స్వయంవరం సినిమా రిలీజ్ అయిన తర్వాత పంజాగుట్ట త్రివిక్రమ్ రూమ్ ముందు ఆరు కార్లు వరుసగా నిలుచున్నాయంట. వాళ్ళందరూ వచ్చి సునీల్ ని త్రివిక్రమ్ ఎక్కడా అని అడిగినప్పుడు, సార్ కొంచెం బిజీగా ఉన్నాడని తిరిగి సమాధానం చెప్పాడు. రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అదృతమైన కథలు మంచి డైలాగులు రాశారు. స్వయంవరం సినిమా తర్వాత చేసిన చిరునవ్వుతో కూడా మంచి హిట్ అయింది.

ఇక చిరునవ్వుతో సినిమాని విజయ్ హీరోగా తమిళ్ లో తెరకెక్కించారు అక్కడ కూడా ఈ సినిమా మంచి హిట్ అయింది. ఈ సినిమాతో సినిమాటోగ్రాఫర్ గా పరిచయమయ్యాడు నటరాజ్ సుబ్రమణ్యం. ఈ నటరాజ్ సుబ్రహ్మణ్యం గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ తమిళ్లో నటరాజ్ సుబ్రమణ్యం అంటే తెలియని వారు లేరు అని చెప్పాలి. నటరాజ్ సుబ్రహ్మణ్యం ను కొంతమంది నట్టి అని కూడా పిలుస్తారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గా నటరాజ్ సుబ్రహ్మణ్యం కు మంచి పేరు ఉంది. అలానే నటుడిగా కూడా సినిమాలు చేయడంతో మంచి గుర్తింపు కూడా ఉంది.

Natarajan Subramaniam

- Advertisement -

ఇక రీసెంట్ గా మహారాజా అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు నటరాజ్ సుబ్రమణ్యం. ఇక్కడితో ఈయన బాగా చేశాడు అని అనుకునే చాలా మంది ఈయన ఎవరు అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు. సినిమాటోగ్రాఫర్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలను చేసి నటుడిగా కూడా గుర్తింపు సాధించుకున్న నటరాజ్ తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అ ఆ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు. అలానే త్రివిక్రమ్ కథ అందించిన చల్ మోహన్ రంగా సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పని చేశాడు. త్రివిక్రమ్ రాసిన కథతో తమిళ్ సినిమాటోగ్రాఫర్ గా పరిచయమైన నటరాజ్ తెలుగులో త్రివిక్రమ్ కథకి సినిమాటోగ్రఫీ చేశాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు