Kalki2898AD : ట్రైలర్ లో ఈ అమ్మాయిని గమనించారా…ఆమెది మహాభారతంలోని ఈ పాత్రే..!

Kalki2898AD : తెలుగు చలనచిత్ర సీమలో అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “కల్కి2898AD”. ఈ మూవీ కోసం ఇండియా వైడ్ గా కాదు, ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఇండియన్ మూవీ లవర్స్ ఎంతో వెయిట్ చేస్తున్నారు. ఇప్పటివరకూ రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్ ఎన్నో అంచనాలను పెంచేసాయి. ఇక నిన్న రిలీజ్ అయిన రిలీజ్ ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలని క్రియేట్ చేసింది. మొదటి ట్రైలర్ ని మించి రెండో ట్రైలర్లో పాత్రలని పరిచయం చేయడమే కాదు, కథకి సంబంధించిన చిన్న చిన్న క్లూస్ ఇచ్చాడు. ఇక ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఈ రిలీజ్ ట్రైలర్ లో మహాభారత కాలానికి సంబంధించి కొన్ని షాట్స్ కూడా చూపించడం జరిగింది. అవి చూడ్డానికి కూడా ఎంతో బాగుండి సినిమాపై అంచనాలని పెంచేసాయి. నాగ్ అశ్విన్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ఒక్కో విజువల్ కూడా ఎంతో ఆకట్టుకుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటివరకు విడుదల చేసిన ట్రైలర్ లలో నిజంగా అమితాబ్ బచ్చన్ పాత్ర, అశ్వద్ధామ పాత్రపైనే ప్రేక్షకుల ఫోకస్ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ యొక్క భైరవ పాత్ర గురించి ఒక టార్గెట్ లైన్ తప్ప… ఎలాంటి క్లూ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా రిలీజ్ ట్రైలర్ (Kalki2898AD) లో ఒక కొత్త పాత్ర కనిపించింది. ఆ పాత్ర ఏమై ఉంటుందా అని నెటిజన్లు తెగ చర్చిస్తున్నారు.

Do you know the role of Malavika Nair in the movie Kalki2898AD?

మహాభారతంలోని ఈ అమ్మాయే ఆ పాత్ర..!

అయితే ట్రైలర్ లో ఆ అమ్మాయి కనిపించిన తీరుని బట్టి, ఆ పాత్ర మహాభారతంలోని పాత్రే అయి ఉంటుందని తెలిసిపోతుంది. ఇక ట్రైలర్ లో కనిపించిన అమ్మాయి పాత్ర “మాళవిక నాయర్”. ఇక ట్రైలర్ లో అన్ని షాట్స్ అల్ట్రా మోడ్రన్ గా చూపిస్తే, ఈ అమ్మాయిని మాత్రం ట్రేడిషనల్ గా చూపించాడు. అక్కడే మహాభారతంలోని పాత్ర అని తెలిసిపోయింది. ఇక మాళవిక నాయర్ కనిపించిన ఆ పాత్ర తీరుని బట్టి ఆమె గర్భవతి అని తెలుస్తూనే ఉంది. ఇక మొదటి టీజర్‌ లో, దీపికా పదుకొనే గర్భవతిగా ఉన్న పాత్రను రక్షించడానికి సిద్ధమవుతున్న బచ్చన్ పాత్ర, అమరుడైన అశ్వద్ధామ పాత్ర అని తెలిసిందే. అయితే ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ లో అశ్వత్థామ పాత్ర యొక్క బ్యాక్‌స్టోరీలోకి వెళుతున్నట్టు చూపించారు. అక్కడ మహాభారత యుద్ధంలో పోరాడుతున్న అశ్వద్ధామ ని చూపించారు. అయితే మహాభారతంలో కురుక్షేత్రం ముగిసాక పాండవుల రక్తసంబంధాన్ని, వారి వంశాంకురాన్ని అంతం చేయడానికి అతను అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భం పైకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు అశ్వద్ధామ, అప్పుడే శ్రీ కృష్ణుడు అశ్వద్ధామ ని కలియుగాంతం వరకూ కురుపిలా ఉండమని శాపగ్రస్తుడు కమ్మని శపిస్తాడు. ఆ “ఉత్తర” పాత్రే ఈ ట్రైలర్ లో కనిపించిన “మాళవిక నాయర్” అని తెలిసిపోతుంది.

- Advertisement -

విజువల్ ట్రీట్ ఇస్తున్న ట్రైలర్…

ఇక ట్రైలర్ లో ఇక బచ్చన్ యొక్క అశ్వద్ధామ పాత్ర చుట్టూ టీజర్‌ లను కేంద్రీకరించడానికి నాగ్ అశ్విన్ తీసుకున్న ఈ వ్యూహాత్మక నిర్ణయం ఒక మాస్టర్‌స్ట్రోక్. ఎందుకంటే ఇది లెజెండరీ నటుడి శక్తివంతమైన పాత్రని, హైలైట్ చేయడమే కాకుండా, ప్రభాస్ భైరవ పాత్ర అశ్వద్ధామ ని అడ్డుకునే ప్రయత్నంలో ఏం చేయబోతున్నాడనే దానిపై చాలా ఉత్సుకతని కూడా పెంచుతుంది. ఇక ట్రైలర్స్ యాక్షన్-ప్యాక్డ్ సన్నివేశాలలో ప్రభాస్ యొక్క యాక్షన్స్ మెప్పిస్తాయి. అయితే పెద్ద కథనంలో ప్రభాస్ యొక్క కథ మరియు పాత్ర స్వభావం రహస్యంగానే ఉన్నాయి. ప్రభాస్ పాత్రకు సంబంధించిన సమాచారాన్ని ఈ వ్యూహాత్మకంగా చెప్పకుండా ఉండడం వల్ల వల్ల సినిమాపై మరింత అంచనాలు పెరిగే అవకాశం ఉంది. అసలు ‘భైరవ కథ ఏంటి?’ అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న గా మారింది. వీటన్నిటి గురించి తెలియాలంటే కల్కి2898AD ట్రైలర్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు