Simhadri : ఎన్టీఆర్ బర్త్ డే కి ఫ్యాన్స్ ఇవ్వబోతున్న గిఫ్ట్ ఏంటో తెల్సా ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు వస్తుండటంతో ఫ్యాన్స్ ఎన్టీఆర్ కి మంచి గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ గిఫ్ట్ కి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేసేసారు ఆయన అభిమానులు  . మే 20 న ఎన్టీఆర్ పుట్టిన రోజు . అయితే ఇది అన్ని పుట్టిన రోజు లాంటి రోజు కాదు ఎందుకంటే , ఇన్ని రోజులు ఎన్టీఆర్ అంటే , తెలుగు సినిమా హీరో మాత్రమే కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ హీరో. ప్రపంచంలో సినిమాని ఆదరించే ప్రేక్షకులు ఉన్న ప్రతి చోట ఎన్టీఆర్ ఎవరు అనేది అందరికి తెల్సు. దీనికి కారణం అయన నటించిన RRR సినిమా ప్రపంచ వ్యాప్తంగా హిట్ అవడమే.

కొమురం భీం పాత్రలో ఆ ఒదిగిన తీరు అద్భుతం అని చెప్పొచ్చు. RRR సినిమా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అవ్వడానికి ఎన్టీఆర్ , రామ్ చరణ్ ల నటన ప్రధాన కారణం. మరి అలాంటి గొప్ప నటుడి ఫ్యాన్స్ అంటే గొప్పగానే ఉంటారు , గొప్పగానే ఆలోచిస్తారు కదా , అయితే ఈ మాటనే నిజం చేస్తూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయనకి ఒక సర్పైజ్ గిఫ్ట్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటో తెల్సా..

ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా రాజమౌళి , ఎన్టీఆర్ కాంబినేషలో వచ్చిన సూపర్ హిట్ సినిమా “సింహాద్రి” ని ఆయన పుట్టిన రోజున రీ-రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే . హీరోల పుట్టిన రోజుల వాళ్ళ సూపర్ హిట్ సినిమాలు రీ-రిలీజ్ చేయడం ఈ మధ్య చాల కామన్ అయిపొయింది. కానీ ఇలా రి-రిలీజ్ చేసిన సినిమాలకి వచ్చే కలెక్షన్ ఎవరికీ వెళ్తున్నాయో చెప్పడం కష్టం. మొన్న బన్ని బర్త్ డే సందర్బంగ  రీ -రిలీజ్ అయినా “దేశముదురు” సినిమా రీలీజ్ చేయడానికి దానయ్య DVV  గారు ఏకంగా 25 లక్షలు తీసుకున్నారంట. ఇక ఆరంజ్ సినిమా విషయానికొస్తే ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన  నాగబాబు గారు ఆరంజ్ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ జనసేన పార్టీ కి విరాళంగా ఇచ్చారు.

- Advertisement -

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఫాన్స్ కూడా ఇలాంటి ఒక మంచి పని చేయడానికి సిద్ధమయ్యారు. అది ఏంటంటే సింహాంద్రి రీ-రిలీజ్ కి సంబంధించిన రైట్స్ ని వల్లే తీసుకొని ఆ సినిమాకి వచ్చే కలెక్షన్స్ ని కష్టాల్లో ఉన్న ఎన్టీఆర్ ఫాన్స్ కి సాయం చేయడానికి ఉపయోగిస్తారట. ఇదే విషయాన్ని ఎన్టీఆర్ ని కలిసి కూడా చెప్పగా మంచి విషయం ఇంకా ఎలాంటి హెల్ప్ కావాలన్న అడగండి నేను చేస్తా అని ఎన్టీఆర్ హామీ ఇచ్చాడు అంట.
ఈ విషయాన్ని అల్ ఇండియా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ  అందరితో పంచుకున్నారు.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు