Tollywood Actor : ఉదయ్ కిరణ్ ఫ్రెండ్ గుర్తున్నాడా? అతను ఇప్పుడేం చేస్తున్నాడో తెలిస్తే మైండ్ బ్లాకే..

Tollywood Actor : టాలీవుడ్ లో ఒక్కప్పుడు సినిమాలు చేసి ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్న నటులు చాలా మందే ఉన్నారు. కొంతమంది నటీనటులు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తూ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. కొందరు సక్సెస్ అయితే మరికొందరు మాత్రం అడపాదడపా సినిమాలు చేస్తూ నెట్టుకోస్తున్నారు. ఇకపోతే ఉదయ్ కిరణ్ (Uday Kiran) తో నటించిన చాలా మంది నటులు ఇప్పుడు సినిమాలకు దూరం అయ్యాయి. ఈ ఫొటోలో ఉదయ్ కిరణ్ ఫ్రెండ్ గా ఉన్న వ్యక్తి ఇప్పుడేం చేస్తున్నాడో అని చాలామంది నెట్లో వెతికేస్తున్నారు.. మరి అతను ఏం చేస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

Do you know what Uday Kiran's friend Jatin Grewal is doing now?
Do you know what Uday Kiran’s friend Jatin Grewal is doing now?

2002లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి బ్లాక్ బాస్టర్ రికార్డు క్రియేట్ చేసింది. ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ (Arthi Aagarwal) జంటకి మంచి ఇమేజ్ కూడా దక్కింది. అయితే ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ ఫ్రెండ్ గా నటించిన వ్యక్తి కూడా అందరికీ గుర్తుండిపోతాడు. ఇక ఆ పాత్రలో బాలీవుడ్ యాక్టర్ జితిన్ గ్రేవాల్‌ (Jithin Grewal నటించాడు. ఉదయ్ కిరణ్ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని స్నేహితుడు పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాంతో ఇతను వరుస సినిమాలు చేస్తాడని అందరు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఒకటి రెండు సినిమాలతో ఇండస్ట్రీకి దూరం అయ్యాడు.

Do you know what Uday Kiran's friend Jatin Grewal is doing now?
Do you know what Uday Kiran’s friend Jatin Grewal is doing now?

ఈ మూవీ తర్వాత బాలయ్య పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాలో మాత్రమే జతిన్ కనిపించాడు. ఆ తర్వాత మరే తెలుగు సినిమాలోని నటించలేదు. ఇక 2016 తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అదే ఏడాది కరోలీనా మాచి అనే అమ్మాయిని వివాహం చేసుకొని అమెరికాకు చెక్కేసాడు. అక్కడే వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూ తన ఫ్యామిలీతో గడుపుతున్నాడు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి కాలిఫోర్నియాలో నివసిస్తున్న జతిన్.. సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటున్నాడు. తన ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తున్నాడు. పలు రకాల బిజినెస్ లతో స్టార్ హీరో కన్నా ఎక్కువ ఆస్తులు సంపాదిస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు