Kalki : కల్కిలో ప్రభాస్ పాత్రను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

Kalki : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ , లెజండరీ దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD.. గత నెల 27 న విడుదలైంది.. ప్రస్తుతం సక్సెస్ టాక్ తో దూసుకుపోతుంది. కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టింది. ఏకంగా 700 కోట్లకు పైగా వసూల్ చేసింది. త్వరలోనే 2000 కోట్లు రాబట్టిన ఆశ్చర్యం లేదు .. మొదటి షో నుంచి ఇప్పటివరకు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.. సినిమాలోని సన్నివేశాలు , పౌరాణికానికి సంబందించిన కథ సినిమాకు ప్లస్ అయ్యింది. ఇక ఈ మూవీ విడుదలైన ప్రతీ చోట రికార్డులు తిరగరాసే కలెక్షన్లు రాబడుతున్నది. అయితే ఇలాంటి చారిత్రాత్మక చిత్రాన్ని ప్రభాస్ కంటే ముందు ఓ సూపర్ స్టార్ ముందుకు అవకాశం వస్తే ఆయన రిజెక్ట్ చేశారనే ఓ వార్త నెట్టింట వినిపిస్తుంది..

ఆ స్టార్ హీరో మరెవ్వరో కాదు . మెగాస్టార్ చిరంజీవి.. మహానటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను అందుకున్న నాగీ చిరంజీవి ఇంట్లో జరిగిన ఒక మీటింగ్ కు హాజరయ్యారట.. ఆ సమయంలో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా సీక్వెల్ ఆలోచన వచ్చింది. అయితే ఆ ఆలోచన అలాగే ఆగిపోయింది.. ఆతర్వాత ఓ రోజు చిరంజీవిని కలిసిన నాగి కల్కి సినిమా కథను మీకోసమే రాసాను అని కొంచెం వినిపించాడట.. కానీ స్టోరీ విని చిరు నో చెప్పాడట.. దాంతో ఆ కథ ప్రభాస్ వద్దకు వచ్చేసిందని ఇండస్ట్రీలో టాక్..

Do you know which star hero rejected Prabhas' role in Kalki?
Do you know which star hero rejected Prabhas’ role in Kalki?

అంతేకాదు చిరంజీవి స్వయంగా భైరవ పాత్రకు ప్రభాస్ అయితే కరెక్ట్ పర్సన్. ఆయనతో సినిమా తీస్తే కథకు న్యాయం జరుగుతుంది. అంతేకాకుండా రీచ్ ఎక్కువగా ఉంటుందని తన అభిప్రాయాన్ని చిరంజీవి మెహమాటం లేకుండా చెప్పారట. రీసెంట్ గా కల్కి సినిమాను ప్రభాస్ తో తీశారు.. సినిమా కథ ప్రేక్షకులను బాగా మెప్పించింది .. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను అందుకుంది. ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో చిరు నాగీ పై ప్రశంసలు కురిపించాడు. ఈ సందర్భంగా నాగి ఈ విషయం గురించి బయటపెట్టాడు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపిక పదుకోన్ లాంటి యాక్టర్లకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తున్నది

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు