Varalakshmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లికి ఎవరెవరిని ఆహ్వానిస్తుందో తెలుసా.?

Varalakshmi Sarathkumar: సీనియర్ నటుడు శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులు పరిచయమైన ఆయన కుమార్తె తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మి. వరలక్ష్మి శరత్ కుమార్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకుంది కేవలం తెలుగులోనే కాకుండా తెలుగు ను మించి తమిళ్లోనే ఎక్కువ సినిమాలు చేసింది.

క్రాక్ సినిమాతో గుర్తింపు

విభిన్నమైన పాత్రలను పోషించి తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఇష్టమైన నటిగా మారిపోయింది. వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన క్రాక్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
ఆ క్రాక్ సినిమాలోని జయమ్మ పాత్రలో వరలక్ష్మి నటించిన తీరు అద్భుతమైన చెప్పొచ్చు. విలన్ గా కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ ను ఇచ్చింది. అలానే గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన వీర సింహారెడ్డి సినిమాల్లో కూడా అద్భుతమైన నటనను ప్రదర్శించింది.

Varalaxmi Sarathkumar

- Advertisement -

హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా

ఇకపోతే రీసెంట్ గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ చిత్రంలో తేజ సోదరిగా నటించి మంచి మార్కులను పొందుకొంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరలక్ష్మి ఇచ్చిన అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఈ సినిమాకి మరికొంత ప్లస్ అయింది.

వరలక్ష్మి శరత్ కుమార్ మ్యారేజ్

కొన్ని రోజుల క్రితం వరలక్ష్మి శరత్ కుమార్ ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్త నిక్లాయ్ సచ్‌దేవ్ తో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ జంట ఇప్పుడు పెళ్లికి సిద్ధమవుతుంది. తరుణంలో చాలామంది సినిమా వాళ్ళను ఆహ్వానిస్తుంది వరలక్ష్మి శరత్ కుమార్. ఇప్పటికే సమంతకు తన వెడ్డింగ్ కార్డును కలిసి ఇచ్చింది. అలానే తనకు మంచి పాత్రలను రాసిన గోపీచంద్ మలినేని కూడా తన వెడ్డింగ్ కార్డు ఇచ్చి కుటుంబ సమేతంగా ఆహ్వానించింది. అలానే చాలామంది సినిమా ప్రేమికులను వరలక్ష్మి శరత్ కుమార్ ఆహ్వానిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు