Thalapathy Vijay69: తలపతి విజయ్ చివరి సినిమాలో నటించనున్న హీరోయిన్ ఎవరో తెలుసా.?

Thalapathy Vijay69: కేవలం అందం ఆకర్షణ తో పాటు బాడీ స్ట్రక్చర్ ఉంటేనే హీరోయిన్లు అవుతారు, అనుకునే తరుణంలో టాలెంట్ తో పాటు హావభావాలు మంచి అభినయం ఉండే వాళ్ళు కూడా హీరోయిన్స్ అవుతారని నిరూపించిన అతి కొద్ది మంది దర్శకులలో సుధా ఒకరు. అయితే సుధా కొంగర దర్శకత్వం వహించిన మొదటి సినిమా గురు. ఈ సినిమాలో రితికా సింగ్ మెయిన్ లీడ్ లో కనిపిస్తుంది. ఈ సినిమా వాస్తవానికి బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. అయితే ఈ సినిమా కోసం హీరోయిన్ కి బాక్సింగ్ నేర్పించడం కాకుండా నిజంగా బాక్సర్ ని తీసుకొచ్చి హీరోయిన్ గా మలిచారు సుధా.

Actor Aparna Balamurali

అపర్ణ బాలమురళికి అవకాశం

మలయాళం లో మహేసింటే ప్రతీకారం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అపర్ణ బాలమురళి. ఇదే సినిమాను తెలుగులో ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య అనే పేరుతో రీమేక్ చేశారు. నేరుగా ఓటీటీలో రీలీజ్ అయిన ఈ సినిమా కూడా మంచి రెస్పాన్స్ ను సాధించుకుంది. అయితే ఓటీటీలో సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ఆకాశం నీ హద్దురా సినిమా కూడా రిలీజ్ అయింది. ఈ సినిమాలో సూర్య సరసన నటించింది అపర్ణ బాలమురళి. సూర్య సరసన నటించిన బాలమురళికి ఈ సినిమాలో మంచి మార్కులు పడ్డాయి. సూర్యకి సరిపడా యాక్టింగ్ చేసి చాలామందిని ఆకట్టుకుంది. ఆ తర్వాత చాలా సినిమాల్లో కనిపించింది అపర్ణ. ప్రస్తుతం అపర్ణ చేస్తున్న అప్కమింగ్ ఫిలిం రాయన్.

- Advertisement -

విజయ్ సినిమాలో అవకాశం

అయితే అపర్ణ బాలమురళి చూడటానికి చాలా బొద్దుగా కనిపిస్తుంది. ఇకపోతే తలపతి విజయ్ తన చివరి సినిమాను చేస్తున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా అపర్ణ బాలమురళిని తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకే హెచ్ వినోద్ అజిత్ తూనీవు అనే సినిమా చేసి మంచి హిట్ కొట్టారు. ఇకపోతే విజయ్ కెరియర్ లో వస్తున్న 69వ సినిమా ఇది. ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు