Vijayashanthi: టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా క్రేజ్ అందుకున్న విజయశాంతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. విజయశాంతి రాములమ్మగా జనాల నుంచి మంచి గుర్తింపు అందుకుంది. దాదాపు 15 ఏళ్లకు పైనే సినిమాల్లో నటించింది. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. విజయశాంతి గత 20 ఏళ్లకు పైగానే రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. విజయశాంతి 1964 జూన్ 24న వరంగల్ లో జన్మించారు. ఆమె అసలు పేరు శాంతి.
అతి చిన్న వయసులోనే హీరోయిన్ గా విజయశాంతి 1979లో కళ్ళు కుల్ ఈరమ్ అనే తమిళ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కిలాడీ కృష్ణుడు అనే సినిమాతో సూపర్ స్టార్ కృష్ణ సరసన హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో తన నటనకుగాను మంచి మార్కులే పడ్డాయి. ఇక ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోలు, హీరోయిన్లందరికీ విజయశాంతి గట్టి పోటీని ఇచ్చింది. చాలా వరకు విజయశాంతి నటించిన సినిమాల్లో పోలీసు పాత్రలే చేయడం విశేషం. లేడీ సూపర్ స్టార్ గా పోలీస్ పాత్రలే విజయశాంతికి మంచి పేరును తెచ్చి పెట్టాయి.
కర్తవ్యం, శత్రువు, శాంభవి ఐపీఎస్, స్టువర్టుపురం పోలీస్ స్టేషన్, పోలీస్ లాకప్ వంటి వివిధ రకాల చిత్రాల్లో ఆమె పోలీస్ గెటప్ పాత్రలో కనిపించి మెప్పించింది. ఇక విజయశాంతి సినిమాల్లో మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే తనకు ఎప్పటినుంచో పరిచయం ఉన్న శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. విజయశాంతికి వివాహమైందన్న సంగతి కూడా చాలా తక్కువ మందికే తెలుసు. ఆమె తన వివాహాన్ని ఎటువంటి హంగామా లేకుండా చాలా సింపుల్ గా చేసుకుందట. ఇక విజయశాంతి రాజకీయాల్లోకి రావడం వెనుక కూడా తన భర్త శ్రీనివాస్ ప్రసాద్ ప్రోత్సాహం ఉందట.
తన భర్త శ్రీనివాస్ ప్రసాద్ కూడా ఓ టాలీవుడ్ నటుడే కావడం గమనార్హం. ఇక విజయశాంతి చాలా రోజుల గ్యాప్ తర్వాత మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఇక రీసెంట్ గా విజయశాంతి కళ్యాణ్ రామ్ చేయబోయే సినిమాలో కీలకపాత్రలో నటించబోతుందట. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ టీజర్ ను విడుదల చేశారు. ఇందులో విజయశాంతి పోలీస్ గెటప్ పాత్రలో అదరగొట్టింది. ఈ టీజర్ ను విజయశాంతి బర్త్డే కానుకగా రిలీజ్ చేశారు.