Shankar Dada MBBS : చిరంజీవి సినిమాలో ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంత పెద్ద హీరోనో తెలుసా..?

Shankar Dada MBBS :  టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ కి ఉన్న క్రేజే వేరు. తెలుగులో ఈ ఫ్యామిలీకి ఉన్నంత ఫ్యాన్ బేస్ ఎవరికీ లేదన్న విషయం తెలిసిందే. అలాగే మెగా ఫ్యామిలీలో ఉన్న ఎక్కువమంది స్టార్ హీరోలు ఏ స్టార్ హీరో ఫామిలీ లోనూ లేరు. మెగాస్టార్ చిరంజీవి అనే మహ వృక్షం నుండి వచ్చిన హీరోలు ఇప్పుడు టాలీవుడ్ ని ఏలుతున్నారు. మామూలుగా ఏ స్టార్ హీరో ఫ్యామిలి నుండి కొత్త హీరో లాంచ్ అయినా, పరిచయం చేయడం వరకే ఫ్యామిలీ చూసుకోగలదు. కానీ ఇండస్ట్రీ లో నిలదొక్కుకోవడం అనేది ఆ హీరో టాలెంట్ పైనే ఆధాపడి ఉంటుంది. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో వస్తే కొన్ని ఎక్కువ అవకాశాలు రావొచ్చేమో గాని, తనని తాను నిలదొక్కుకునే వరకూ పేక్షకులు సపోర్ట్ చేయరు.

అలాగే మెగా ఫ్యామిలీ నుండి రాగానే ఎవరూ స్టార్ హీరోలు కాలేదు. పవన్ కళ్యాణ్ సహా అందరూ చాలా కష్టపడ్డారు. కంటెంట్ ఉన్న సినిమాలు, ప్రేక్షకులు మెచ్చే సినిమాలు చేస్తూ, తమ నటనా ప్రతిభతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. ఇక చిరంజీవి సహా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నారు. చిరు ఫ్యామిలీ లో అందరూ ఎంత స్టార్ హీరోలైన కలిసిమెలిసి ఉంటారు. ఇదిలా ఉండగా 20 ఏళ్ళ కిందటి చిరంజీవి ఫ్యామిలీ పిక్ ఒకటి నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది.

Do you remember the child artist in Chiranjeevi's movie 'Shankar Dada MBBS'?

- Advertisement -

చిరు శంకర్ దాదా సినిమాలో నటించిన ఈ హీరోని గుర్తుపట్టగలరా?

ఇక తాజాగా వైరల్ అవుతున్న సినిమాలో ప్రస్తుతం మెగాఫ్యామిలీ లో ఉన్న అందరు హీరోలు ఆ పిక్ లో ఉన్నారు. అయితే అందులో ఇప్పటి హీరోలని కొంతమంది గుర్తుపట్టకపోవచ్చు. ఇదిలా ఉండగా చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా గుర్తుందా? 20 ఏళ్ళ కింద వచ్చిన ఆ సినిమా అప్పట్లో భారీ హిట్ అయింది. ఈ మధ్యనే రీ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక అసలు విషయానికి వస్తే… ఆ సినిమాలో కోమాలో పేషేంట్ గా ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడుగా! శ్రీరామ్ చంద్రమూర్తి పేరుతో ఆ సినిమాలో కొద్దీ సేపే ఉన్నా ఆకట్టుకున్నాడు. అయితే ఆ చైల్డ్ ఆర్టిస్ట్ మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే అని ఎంతమందికి తెలుసు? అవును.. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ మెగా కుటుంబంలో ఒకడు, కాగా ఇప్పుడు హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తున్నాడు. అతనెవరో కాదు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. తాజాగా వైరల్ అవుతున్న పిక్ లో కింది వరుసలో మధ్యలో యెల్లో టీషర్ట్ లో కూర్చున్నాడు.

పిక్ లో ఎవరెవరున్నారంటే…

ఇక వైరల్ అవుతున్న మెగా ఫ్యామిలీ పిక్ లో చిరంజీవి తల్లిదండ్రులతో సహా, చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ తమ కుటుంబంతో ఉన్నారు. అలాగే పవన్ పక్కన రేణు దేశాయ్ ఉన్నారు. అలాగే చిరు చెల్లెళ్లు ఇద్దరూ వారి ఫ్యామిలీతో ఉన్నారు. ఇక మధ్యలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన సిస్టర్స్ తో కూర్చుని ఉన్నాడు. అలాగే చరణ్ పక్కన ఉన్న మరో ఇద్దరు పిల్లల్లో ఒకరు వరుణ్ తేజ్, మరొకరు సాయిధరమ్ తేజ్. ఇక అల్లు ఫ్యామిలీ ఇందులో లేదు. ఈ పిక్ లో ముగ్గురు హీరోలు తెలుగు చిత్ర సీమలో అగ్రహీరోలుగా ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు