Pawan Kalyan : పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని అనకండి, కావాలంటే మీకోసం బైక్ రేస్ పెడతా

Pawan Kalyan : దర్శకుడు హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ కోసం ఒక డైలాగ్ రాస్తాడు. ఆ డైలాగ్ ఏంటంటే “నేను ట్రెండ్ ఫాలో అవ్వను ట్రెండ్ సెట్ చేస్తాను”. ఆ డైలాగులు చెప్పినట్లు పిఠాపురంలోని చాలామంది సభ్యులు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ ద్విచక్ర వాహనాలు వెనుక, ఆటోలు వెనక స్టిక్కరింగ్ చేయడం మొదలుపెట్టారు. అయితే తర్వాత ఆ డైలాగ్ చాలా ఫేమస్ గా మారింది. ఎంత ఫేమస్ గా మారిందంటే అది పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా వెళ్లిపోయింది.

ఇక పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించి 2019లో రెండు చోట్ల పోటీ చేశారు. అయితే పోటీ చేసిన రెండు చోట్ల కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. అక్కడితో చాలామంది పవన్ కళ్యాణ్ ను పర్సనల్ గా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇకపోతే 2024 ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ కీలక పాత్రను పోషించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలుకా అని అనకండి. రూల్స్ ను పాటించండి, వన్ వేలో వెళుతూ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, ట్రిపుల్ డ్రైవింగ్ లో వెళ్తూ పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా, రాంగ్ రూట్ లో వెళ్తూ పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని అనకండి మనం రూల్స్ ను పాటించాలి. దయచేసి నాకు చెడ్డ పేరు తీసుకురాకండి అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

- Advertisement -

Pawan Kalyan

అలానే నాకు ఇక్కడ ఒక రెండు ఎకరాల స్థలం ఉంది అక్కడ మీరు తిప్పాలి అంటే మీ బైక్స్ తిప్పుకోండి అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మీకు కావాలంటే అక్కడ బైక్ రేసింగ్ కూడా పెడతాను అంటూ చెప్పాడు పవన్ కళ్యాణ్. బైక్ రేసింగ్ అంటే ప్రాణానికి ఎటువంటి హాని లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని హెల్మెట్ తో సహా అన్నింటిని ప్రాపర్ గా అరెంజ్ చేసి మరి బైక్ రేస్ పెట్టిస్తాను అని చెప్పారు పవన్ కళ్యాణ్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు