రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ గా మరోసారి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయాడు. గతకొద్ది రోజులుగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్కంద సినిమా లుక్ లో కనిపించిన రామ్, మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ మేకోవర్ లోకి వచ్చేసాడు. సెలెబ్రెటీ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హాకిన్, రామ్ పోతినేనిని ఇస్మార్ట్ శంకర్ మేకోవర్ లోకి తీసుకురాగా, ప్రస్తుతం మేకోవర్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2019 లో వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ పేరుతో సినిమాను రూపొందిస్తున్నాడు పూరి. హీరోయిన్ ఛార్మి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ రేపటి నుంచే మొదలవబోతుంది. దాంతో హీరో రామ్ ఇస్మార్ట్ శంకర్ లుక్ లోకి వచ్చేసాడు.
రామ్ గత కొద్దీ కాలంగా మాస్ హీరో ఇమేజ్ కోసం సిన్సియర్ ట్రై చేస్తుండగా, ఒక్కటి కూడా వర్క్ అవుట్ అవ్వలేదు. ఇక మాస్ సినిమాలకు గుడ్ బాయ్ చెప్పబోతున్న సమయంలోనే పూరి చెప్పిన ఇస్మార్ట్ శంకర్ కథతో ఇంకొక్క సారి మాస్ యాంగిల్ ట్రై చేద్దామని ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ఒప్పుకోగా ఎవరు ఊహించని విధంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచి. అటు రామ్ కెరీర్ కు, పూరి కెరీర్ చాలా ఉపయోగ పడింది. దాంతో వీరిద్దరి కాంబినేషన్ కు మార్కెట్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇస్మార్ట్ శంకర్ కేవలం తెలుగు వరకే పరిమితం కాగా డబుల్ ఇస్మార్ట్ ను మాత్రం పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో రామ్ కూడా పాన్ ఇండియా హీరో అవుతాడని నమ్మకంగా ఉన్నాడు. వచ్చే ఏడాది శివరాత్రి కానుకగా ఈ సినిమా థియేటర్స్ లో విడుదలవ్వబోతుంది.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News