Double Ismart: ఫోకస్ అంతా మిస్టర్ బచ్చన్ సినిమా వైపు షిఫ్ట్ అయిపోయింది, పాపం ఇస్మార్ట్ పరిస్థితి ఏంటో.?

Double Ismart: పూరి జగన్నాథ్ రామ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా డబల్ ఇష్మార్ట్. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా వచ్చింది. చాలా రోజుల తర్వాత ఈ సినిమాతో పూరి ఒక సక్సెస్ చూశాడు. ఈ సినిమాకి మల్టీప్లెక్స్ లో మొదట నెగిటివ్ టాక్ వచ్చినా కూడా చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పెట్టారు. ఈ సినిమా తర్వాత పూరి చేసిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గానే మిగిలాయి. ఈ సినిమా తర్వాత పూరి కనెక్ట్స్ నుంచి మెహబూబా, రొమాంటిక్ సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత పూరి దర్శకత్వంలో లైగర్ అనే సినిమా కూడా వచ్చింది.

ఫోకస్ మిస్టర్ బచ్చన్ వైపు షిఫ్ట్

లైగర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మినిమం ఎక్స్పెక్టేషన్స్ కూడా రీచ్ కాలేదు. ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొడతారని అందరూ ఊహించారు. కానీ ఈ సినిమా భారీ నష్టాలను చవిచూసింది. ఇకపోతే ఇప్పుడు అందరు చూపులు కూడా డబల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా పైన ఉన్నాయి. ఆగస్టు 15న రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు సరైన ప్రమోషన్ కూడా చేయలేదు. మరోవైపు రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఆ చిత్ర యూనిట్ ఇప్పటివరకు సినిమా నుంచి మూడు పాటలను ఒక టీజర్ రిలీజ్ చేసింది. ఇవన్నీ కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు మెల్లగా డబల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా నుంచి ఫోకస్ మిస్టర్ బచ్చన్ వైపు షిఫ్ట్ అవుతుంది.

Mr Bachchan

- Advertisement -

ఇప్పుడు డబల్ ఇస్మార్ట్ శంకర్ చిత్ర యూనిట్ జాగ్రత్త పడాల్సి ఉంది. వాస్తవానికి ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రేపు రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా నుంచి ఇదివరకే మూడు పాటలను రిలీజ్ చేశారు. అయితే ఈ పాటలు మణిశర్మ అందించిన కూడా అవి ఆకట్టుకునే స్థాయిలో లేవు అనేది చాలామంది ఉద్దేశం. పూరి జగన్నాథ్ సినిమా రిలీజ్ అవుతుందేనంటే ప్రమోషన్స్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంటాయి. కానీ ఈ సినిమాకి సంబంధించి అసలు ప్రమోషన్స్ కూడా పెద్దగా స్టార్ట్ చేయలేదు. ఇంకా పూరి జగన్నాథ్ ముంబై నుంచి రాలేదు అని వార్తలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా ఒక మంచి సినిమా చేయడం ఎంత అవసరమో, ఆ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడం కూడా అంతే అవసరం.

ఈ సినిమా ట్రైలర్ను రేపు వైజాగ్ లో రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు కాబట్టి కచ్చితంగా టీం అక్కడికి వచ్చే అవకాశం ఉంది. అయితే వీళ్లకు డిస్ట్రిబ్యూటర్స్ తో ఉన్న సమస్యలను తీర్చి సినిమా ప్రమోషన్స్ ను మొదలు పెడితే ఈ సినిమా గురించి కూడా చాలామందికి తెలిసి అవకాశం ఉంది. లేదంటే సినిమా ఎప్పుడొచ్చి ఎప్పుడు వెళ్ళిపోతుందో అనేటట్లే ఉంటుంది. ఈ సినిమా సక్సెస్ అనేది పూరి జగన్నాథ్ కి చాలా అవసరం. మరోవైపు రామ్ కూడా హిట్ సినిమా చేసి చాలా రోజులు అయిపోయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు